కొనసాగుతున్న టీడీపీ దాడులు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు | TDP Activists Attack On YSRCP Supporters In AP | Sakshi
Sakshi News home page

పెద్దిరెడ్డి, మిథున్‌ రెడ్డి రాక.. పుంగనూరులో టీడీపీ నేతల ఓవరాక్షన్‌

Published Sat, Jun 15 2024 10:55 AM

TDP Activists Attack On YSRCP Supporters In AP

సాక్షి, కర్నూలు: ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, మద్దతుదారులపై పచ్చ బ్యాచ్‌ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో పలువురి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఇక, తాజాగా కర్నూలు జిల్లాలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. తుగ్గలి మండలంలోని డీసీకొండలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త శ్రీనివాసులుపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాసులుకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరో వైఎస్సార్‌సీపీ కార్యకర్త శేఖర్‌పైనా దాడికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బాధితులు జొన్నగిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 

పుంగనూరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేత వెంకట్‌రెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ క్రమంలో వెంకట్‌రెడ్డి ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఇంతా జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. పుంగనూరులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్‌కు దిగారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి కాసేపట్లో పుంగనూరుకు రానున్న నేపథ్యంలో పచ్చ బ్యాచ్‌ హంగామా చేస్తోంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement