కారం, పెట్రోలు, డీజిల్‌ చల్లి.. | TDP assassination attempt on YSRCP leader | Sakshi
Sakshi News home page

కారం, పెట్రోలు, డీజిల్‌ చల్లి..

Published Tue, Aug 20 2024 5:55 AM | Last Updated on Tue, Aug 20 2024 5:55 AM

TDP assassination attempt on YSRCP leader

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై టీడీపీ నేతల హత్యాయత్నం

మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ లీజుపై     ఇరువర్గాల మధ్య వివాదం 

కర్రలు, రాడ్డులతోనూ దాడిచేయడంతో పలువురికి తీవ్ర గాయాలు 

మైలవరం నియోజకవర్గంలో ఘటన

సాక్షి ప్రతినిధి, విజయవాడ : మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ లీజు విషయమై తలెత్తిన వివాదంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులను హతమార్చేందుకు టీడీపీ శ్రేణులు దాడికి బరితెగించాయి. ఎనీ్టఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గం కనిమెర్ల తండాలో జరిగిన ఈ సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ దాడులను టీవీలు, పేపర్లు, సోషల్‌ మీడియాలో మాత్రమే చూస్తున్న నియోజకవర్గ ప్రజలకు ఈ ఘటన కలవరపాటుకు గురిచేసింది. వివరాలివీ.. కనిమెర్ల తండా, పోరాటనగర్, కత్తుల తండా.. రెడ్డిగూడెం మండల పరిధిలోని నాగులూరు తండా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కనిమెర్ల తండాలో వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను 2020లో ఏర్పాటుచేశారు.

దీనికి ఒక కమిటీగా ఏర్పడిన గ్రామస్తులు ప్లాంట్‌ నిర్వహణ బాధ్యతలను నాలుగేళ్ల లీజుకుగానూ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు బాణావతు వాసుకు రూ.70వేలకు అప్పగించారు. ఈ లీజు గడువు వచ్చేనెల 19 వరకు ఉంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన దగ్గర నుంచి గ్రామానికి చెందిన కొందరు టీడీపీ లీడర్లు ఈ ప్లాంటుపై కన్నేశారు. ఈ క్రమంలో ప్లాంట్‌ నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలంటూ బాణావతు వాసుని బెదిరించడం ప్రారంభించారు. లీజు గడువు తీరేవరకు ప్లాంటును అప్పగించేదిలేదని వాసు తేలి్చచెప్పడంతో టీడీపీ నేతలు సోమవారం ఉదయం అతనిపై దాడికి తెగబడ్డారు.  

మూకుమ్మడిగా దాడి.. 
ఈ ప్లాంట్‌ విషయమై సోమవారం ఉదయం ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు ఒక్కసారిగా పెట్రోలు, డీజిల్, కారం చల్లి, కర్రలు, రాడ్డులతో వాసుతో పాటు అతని కుటుంబ సభ్యులపై మూకుమ్మడిగా దాడిచేశారు. ఈ సమయంలో గ్రామస్తులు అప్రమత్తమవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ దాడి ఘటనలో వాసు, బాణావతు శంకర్‌ తలలకు తీవ్రగాయాలు కాగా.. అజీ్మర జమలయ్య, లక్ష్మయ్య, అమల, భానుప్రియ, అంజయ్యలకు కంటికి కనిపించని తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాక.. గ్రామానికి చెందిన మరికొందరూ స్వల్పంగా గాయపడ్డారు. ఈ దాడికి రెడ్డిగూడెం మండల పరిధి నాగులూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత విజయబాబు ప్రోద్బలం ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాక.. ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులు కూడా విజయబాబు అనుచరులేనని స్పష్టంచేశారు. మైలవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాధితులపై పోలీసుల కర్కశత్వం 
ఇదిలా ఉంటే.. దాడి ఘటనలో పోలీసుల తీరు విస్మయానికి గురిచేసింది. ఎక్కడైనా దాడులు జరిగినప్పుడు క్షతగాత్రులైన బాధితుల వద్దకు పోలీసులు వెళ్తారు. కానీ, ఇక్కడ దాడిచేసిన వర్గంతో పాటు బాధితులను పోలీసుస్టేషన్‌కు పిలిపించి గంటల తరబడి నిరీక్షించేలా చేశారు. గాయపడ్డ వారిని విజయవాడ వెళ్లాలని స్థానిక ప్రభుత్వాస్పత్రి వైద్యులు సూచించినప్పటికీ సీఐ పిలుపుతో వారు నొప్పులతో నరకయాతన అనుభవించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement