108లో సమ్మె సైరన్
మదనపల్లె సిటీ: ఆపద్బాంధవులుగా పేరొందిన 108 సిబ్బంది ఆపదలో పడ్డారు. అరకొర వేతనాలతో కంటి మీద కనుకు లేకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న వారు కూటమి ప్రభుత్వం తీరుతో కలవరం చెందుతున్నారు. 108 సర్వీసుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం వేస్తున్న అడుగులు వారిలో ఆందోళనకు కారణమైంది. విధిలేని స్థితిలో ఉద్యోగ భద్రత కోసం పోరుబాటకు సిద్ధమయ్యారు.
నిరసన తెలిపినా స్పందించని సర్కారు:
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 108 సిబ్బంది ఒక రోజు నిరసన చేపట్టారు. వినతులు ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా స్పందించకపోవడంతో ఈనెల 25 నుంచి విధులు బహిష్కరించి సమ్మెలోకి వె వెళుతునట్లు ప్రకటించారు. ఇప్పటికే ముందస్తు నోటీసు సైతం ఉన్నతాధికారులకు అందజేశారు.
– జిల్లాలో ప్రతి నెలా మొత్తం మీద 3,500 నుంచి 4 వేల వరకు అత్యవసర కేసుల నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 108 సిబ్బంది సమ్మెలోకి వెళితే అత్యవసర సమయంలో రోగులను తరలించేందుకు అంబులెన్స్ అందుబాటులో ఉండవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ డిమాండ్లు:
● 108 సర్వీసులోని ఉద్యోగులను వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులుగా గుర్తించి నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలి.
● జీవో నెంబర్.49ను పునరుద్ధరించాలి. పైలెట్ గ్రాట్యుటీ, ఎర్నడ్‌లీవు అమౌంట్ (ఆర్జిత సెలవు మొత్తం), వార్షిక ఇంక్రిమెంటును చెల్లించాలి.
● ప్రతి నెలా జీతాలు 5వ తేదీలోపు చెల్లింపులు జరగాలి. 108లో షిప్టుల పద్ధతిని అమలు చేయాలి.
● వైద్య ఆరోగ్యశాఖలో చేపట్టే నియామకాల్లో సర్వీసుకు అనుగుణంగా వెయిటేజ్ మార్కులు అందించాలి.
● విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి మరణించిన తర్వాత బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా రూ.20 లక్షలు ఇవ్వాలి.
మావి న్యాయమైన కోర్కెలే:
అత్యవసర సర్వీసుల్లో పని చేస్తున్న మేము విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నామనే సంతోషంతో కష్టాన్ని మరిచిపోతున్నాం. మా కుటుంబాల జీవనం సాఫీగా సాగాలంటే పనికి తగ్గ జీతం ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. –ఎస్వీ రమణ,
108 ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
25 నుంచి సమ్మెలోకి...
మా ఇబ్బందులు ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర యూని యన్ పిలుపు మేరకు సమ్మెకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చాం. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరిస్తుందనే ఆశిస్తున్నాం. –రెడ్డి జస్వంత్, 108 ఎంప్లాయిస్
యూనియన్ మదనపల్లె డివిజన్ అధ్యక్షుడు
108 సిబ్బంది సమస్యలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం
ఈనెల 25 నుంచి సమ్మెలోకి
ఆందోళన చెందుతున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment