డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
మదనపల్లె: మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఖాళీగా ఉన్న రేషన్‌షాపులకు డీలర్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ తెలిపారు. సోమవారం సబ్ కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రేషన్ డీలర్ల భర్తీ ప్రక్రియకు సంబంధించిన రివైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ...మదనపల్లె డివిజన్‌లో 445 రేషన్‌షాపులు ఉన్నాయన్నారు. వీటిలో 74 షాపులు డీలర్లు లేక ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే...1,000 కార్డులకు పైబడి 1,500 కార్డుల వరకు కలిగి ఉన్న షాపులను విభజించేందుకు ప్రతిపాదనలు తయారుచేస్తే 45 షాపులు ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతో మొత్తం 119 షాపులకు డీలర్ల నియామకానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. రెవెన్యూ డివిజన్‌లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఖాళీలకు సంబంధించిన వివరాలు నోటీసుబోర్డులో ప్రదర్శిస్తామని తెలిపారు. రేషన్‌షాపులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండి 18–40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. ఖాళీగా ఉన్న రేషన్‌షాపు ఉన్నటువంటి వార్డులో కానీ, గ్రామంలో కానీ నివాసం ఉండాలన్నారు. డిసెంబర్ 21వతేదీ సాయంత్రం 5 గంటలలోపు పూర్తిచేసిన దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులకు డిసెంబర్ 28వతేదీ ఉదయం 10 గంటలకు 80 మార్కులకు రాతపరీక్ష ఉంటుందని, అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 1:15 నిష్పత్తిలో డిసెంబర్ 30, 31 తేదీల్లో 20 మార్కులకు వినియోగదారుల సంబంధాలు, నిర్వహణ సామర్థ్యము, ఆర్థిక స్తోమత తదితర అంశాలపై ఇంటర్వూలు నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు.
మదనపల్లె మండలం, అర్బన్ ఖాళీల వివరాలు
అంకిశెట్టిపల్లె(ఓసీ–మహిళ), మందబండ(ఓసీ–మహిళ), వలసపల్లె(ఓసీ), కాకరకాయలపల్లె(ఓసీ), డ్రైవర్స్‌కాలనీ, పుంగనూరురోడ్డు, గంగమ్మగుడి(బీసీ–ఏ), పప్పిరెడ్డిగారిపల్లె(బీసీ–బీ మహిళ), సైదాపేట(ఓసీ), గుండ్లూరువీధి(ఓసీ), సిపాయివీధి(ఓసీ), గొల్లపల్లె క్రాస్(ఓసీ), ఇందిరానగర్(బీసీ–ఈ)
సబ్ కలెక్టర్ మేఘస్వరూప్
Comments
Please login to add a commentAdd a comment