కడప కార్పొరేషన్: వైఎస్సార్‌జిల్లా కడప నగరపాలక సంస్థలో ఏడుగురు కార్పొరేటర్లు, నలుగురు పార్టీ నాయకులను సస్పెండ్ చేసినట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2వ డివిజన్ కార్పొరేటర్ ఎం.సుబ్బారెడ్డి, 3వ డివిజన్ కార్పొరేటర్ ఎం.మానస, 6వ డివిజన్ కార్పొరేటర్ నాగేంద్రప్రసాద్, 8వ డివిజన్ కార్పొరేటర్ ఎ.లక్ష్మీదేవి, 32వ డివిజన్ కార్పొరేటర్ ఎస్‌బీ జఫ్రుల్ల, 42వ డివిజన్ కార్పొరేటర్ సి.స్వప్న, 50 డివిజన్ కార్పొరేటర్ కె.అరుణ ప్రభ, పార్టీ నాయకులు ఎం.సుదర్శన్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, చల్లా రాజశేఖర్, కె.రాజ శేఖర్‌రెడ్డిలను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్ట్యా సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఆయా డివిజన్‌లకు కొత్త ఇన్‌చార్జిలను నియమిస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment