‘గుడ్ గవర్నెన్స్ వీక్’ను విజయవంతం చేయండి
కడప సెవెన్‌రోడ్స్: ‘ప్రశాసన్ గావోన్ కి ఓర్–2024’ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 24 వరకు జరిగే గుడ్ గవర్నెన్స్ వీక్ (జీజీడబ్ల్యూ) క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని డీఆర్వో విశ్వేశ్వర్ నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి భారత ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏర్‌పీజీ) కార్యాలయం నుంచి గుడ్ గవర్నెన్స్ వీక్ (జీజీడబ్ల్యూ) క్యాంపెయిన్ ప్రచార ప్రణాళికపై.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాల మేరకు స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి డీఆర్వోతోపాటు జిల్లా పరిషత్ సీఈవో ఓబులమ్మ, ఇన్‌చార్జి సీపీవో హజరతయ్య, డీఐఓ విజయ్‌కుమార్, డీఐపీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం డీఆర్వో మాట్లాడుతూ ‘ప్రశాసన్ గావోన్ కి ఓర్’ – 2024 కార్యక్రమం నిర్వహణకు జిల్లాలో విస్తృతమైన ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భారత ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి, పబ్లిక్ సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని వివరించారు.
డీఆర్వో విశ్వేశ్వర్ నాయుడు
Comments
Please login to add a commentAdd a comment