రైల్వే అధికారులు.. నీళ్లు నములుతున్నారు! | - | Sakshi
Sakshi News home page

రైల్వే అధికారులు.. నీళ్లు నములుతున్నారు!

Published Wed, Dec 18 2024 2:07 AM | Last Updated on Wed, Dec 18 2024 2:07 AM

రైల్వ

రైల్వే అధికారులు.. నీళ్లు నములుతున్నారు!

రాజంపేట: గుత్తి–రేణిగుంట రైలుమార్గంలోని వివిధ రైళ్లకు నందలూరు స్టేషన్‌లో నీటి సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదన పట్టాలెక్కలేదు. రైళ్లకు నందలూరులో నీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన పనులకు రూ.34లక్షలకుపైగా వ్యయం అవుతుందని అంచనాలను రూపొందించినట్లు రైల్వే వర్గాల ద్వారా తెలిసింది. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో అప్పట్లో ఈ ప్రతిపాదనను రైల్వే శాఖ అటకెక్కించింది. కరోనా మహమ్మారి ప్రభావం ముగిసి ఐదేళ్లయినా ఈ ప్రతిపాదనను అమలు చేయాలన్న దిశగా రైల్వే ఉన్నతాధికారులు ఆలోచించడం లేదు. అక్టోబరు 4న విజయవాడలో జరిగిన రైల్వే అధికారుల సమావేశంలో రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిలు నందలూరురైల్వేకు పూర్వవైభవం కల్పించే అంశాలను ప్రస్తావించారు.

నందలూరు నీళ్ల ప్రాముఖ్యత..

దక్షిణ మధ్య రైల్వేలో గుంతకల్లు డివిజన్‌లో నందలూరు నీళ్లకున్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఇటీవల ఇదే అంశంపై దిల్లీలో రైల్వే స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ సీఎం రమేష్‌ను నందలూరు ఐకేపీఎస్‌ నేతలు కలిసిన సందర్భంలో ఆయన కూడా నందలూరు నీళ్ల ప్రాముఖ్యతను గుర్తు చేశారు. నందలూరు నీటితోనే రైల్వే పుట్టుక ఆరంభమైంది. 1864లో బ్రిటీషర్లు నందలూరులో నీటి లభ్యతను ఆధారం చేసుకొని స్టీమ్‌ ఇంజిన్‌ లోకోషెడ్‌ నిర్మించారు. ఈ నీటి వల్ల నీటి ఆవిరికి సంబంధించిన పింగాణి తుప్పు పట్టకుండా ఉంటుందని అప్పట్లోనే బ్రిటీషు రైల్వే పాలకులు నీటి నాణ్యతపై పరిశోధనలు చేశారు. రైల్వేకేంద్రానికి అవసరమైన నీటి కోసం యేటి నొడ్డున బావిని తవ్వించారు.

నీటి కోసం ‘తిరుమల’ పరుగులు..

విశాఖ –తిరుపతి మధ్య నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు నీటి కోసం కడప నుంచి కొండాపురం వరకు పరుగులు తీయకతప్పడంలేదు. ఫలితంగా రైల్వే వ్యయం వృథా అవుతోంది. అనవసర ఖర్చులు, భారం రైల్వేపై పడుతోందని రైల్వే వర్గాలు అంటున్నాయి. కేవలం రైల్వే అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల పరోక్షంగా నష్టం కలుగుతోందన్న విమర్శలు రైల్వేవర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ మార్గంలో నడిచే రైళ్లకు నీళ్లు పట్టుకునేందుకు నందలూరు అనుకూలమని ఇప్పటి డివిజన్‌ ఉన్నతాధికారులకు తెలుసు. కడప నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరులో తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు వాటరింగ్‌, క్లీనింగ్‌ పెట్టుకోకుండా కడప నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని కొండాపురం తీసుకెళ్లి, మళ్లీ కడపకు తీసుకొచ్చి నడిపించడం చూస్తుంటే విడ్డూరంగా ఉందని కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి.

రేణిగుంట, తిరుపతి

రైల్వేస్టేషన్లపై భారం తగ్గుతుంది..

ఇటీవల ముంబయి–చైన్నె మధ్య నడిచే రైళ్లలో లెట్రిన్‌లో, వాష్‌బేసిన్‌లో నీళ్లు రావడంలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి అన్ని రైళ్లలో దాదాపుగా ఉంది. నందలూరులో వాటరింగ్‌ ఏర్పాటుతో రేణిగుంట, తిరుపతి రైల్వేస్టేషన్లలో కొన్ని రైళ్లకై నా భారం తగ్గుతుంది. ఫలితంగా లైన్ల రద్దీ తగ్గుతుంది. గుత్తి–రేణిగుంట మార్గంలో నడిచే రైళ్లన్నింటికి నందలూరులో నీటిని నింపుకునేందుకు పుష్కలంగా వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు రైల్వేశాఖకు మంచి అవకాశం ఉంది. వాటరింగ్‌కు అనుకూలంగా నందలూరులో ఏడులైన్లు ఉన్నాయి.

నందలూరు నుంచే వాటర్‌ ట్యాంకర్‌ రైళ్లు నడిచాయి..

స్టీమ్‌ ఇంజిన్‌ లోకోషెడ్‌ కొనసాగిన సమయంలో నందలూరు నుంచే వాటర్‌ ట్యాంకర్‌ రైళ్లు నడిచాయి. గుంతకల్‌ డివిజన్‌ ఉన్నతాధికారులు ప్యాసింజర్‌ రైళ్ల బ్రేక్‌లలో నీటి క్యాన్‌లతో సరఫరా జరిగేది. 1977లో గుంతకల్లు డివిజన్‌ సదరన్‌ రైల్వే నుంచి విడిపోయి దక్షిణ మధ్య రైల్వేలో విలీనం అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఉద్యోగులు ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారంటే నీళ్లే కారణంగా చెబుతున్నారు.

రైళ్లకు నందలూరులో నీటి సౌకర్యం కల్పించే ప్రతిపాదన పెండింగ్‌లోనే..

అప్పట్లో రూ.34 లక్షలకుపైగా వ్యయంతో అంచనాలు

నందలూరు నీళ్ల ప్రాముఖ్యతను విస్మరిస్తున్న రైల్వే శాఖ

రైల్వే అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

రైళ్లలో నీటి సమస్య తీరుతుంది

ఇప్పుడు ఈ మార్గంలో నడిచే ఏ రైలులో అయినా నీటి సమస్య తీవ్రంగా ఉంది. నందలూరు రైల్వే కేంద్రంలో వాటరింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తే రైళ్లలో నీటి సమస్య తీరుతుంది. అంతేగాకుండా రేణిగుంటలో రైళ్లకు నీళ్లు పట్టాల్సిన అవసరం ఉండదు. కొన్ని రైళ్లకు నందలూరులో నీటిని నింపుకోవచ్చు.

–ఫైజుల్లాఖాన్‌ లోడి, లోక్‌ అదాలత్‌ సభ్యుడు

నందలూరు నీళ్లకున్నప్రాముఖ్యతను రైల్వే గుర్తించాలి

నందలూరు నీళ్లకున్న ప్రాముఖ్యతను రైల్వే యాజమాన్యం ఇప్పటికై నా గుర్తించాలి. నందలూరు నీళ్లు ఒక్కసారి తాగితే ఈ ప్రాంతాన్ని మరువలేరు. రైళ్లలో ప్రయాణించేవారు నందలూరు వస్తుందంటే నీళ్లు పట్టుకోవాలనే వారు. అది నందలూరు నీళ్లకున్న గుర్తింపు.

– గానుగపెంట హనుమంతరావు, సాహితీవేత్త

No comments yet. Be the first to comment!
Add a comment
రైల్వే అధికారులు.. నీళ్లు నములుతున్నారు! 1
1/4

రైల్వే అధికారులు.. నీళ్లు నములుతున్నారు!

రైల్వే అధికారులు.. నీళ్లు నములుతున్నారు! 2
2/4

రైల్వే అధికారులు.. నీళ్లు నములుతున్నారు!

రైల్వే అధికారులు.. నీళ్లు నములుతున్నారు! 3
3/4

రైల్వే అధికారులు.. నీళ్లు నములుతున్నారు!

రైల్వే అధికారులు.. నీళ్లు నములుతున్నారు! 4
4/4

రైల్వే అధికారులు.. నీళ్లు నములుతున్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement