కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాగ్వాదం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి, నగర అధ్యక్షుడు అఫ్జల్‌ఖాన్ మధ్య మంగళవారం వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల జన్మదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసేందుకు అఫ్జల్‌ఖాన్ ఏర్పాట్లు చేశారు. అప్పటికే నగరంలోని అశోక్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కో–ఆర్డినేటర్ బండి జకరయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ కార్యక్రమాలు ముగించుకొని పార్టీ కార్యాలయానికి చేరుకోగానే.. నగర అధ్యక్షుడు కేక్ కట్ చేసేందుకు పిలిచారు. తనకు ముందస్తు సమాచారం లేకుండా.. ఎలా కేక్ కట్ చేస్తానంటూ విజయజ్యోతి మండి పడ్డారు. డీసీసీ అధ్యక్షురాలు మహిళ అని కూడా చూడకుండా, గౌరవంగా పిలవకపోవడం ఏమిటని వాగ్వాదానికి దిగారు. అక్కడ వివాదం నెలకొనడంతో ఆమె వెళ్లిపోయారు. ఈ విషయంపై డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ నగర అధ్యక్షుడు అఫ్జల్‌ఖాన్‌కు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో సంబంధం లేదని అన్నారు. తనకు సమాచారం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వస్తుందన్నారు. నగర అధ్యక్షుడి తీరుపై అధిష్టానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తనకు, పార్టీ కార్యాలయానికి సంబంధం ఉందో లేదో అధిష్టానం తేలుస్తుందని నగర అధ్యక్షుడు చెబుతున్నారు.
షర్మిల జన్మదిన వేడుకల్లో
డీసీసీ, నగర అధ్యక్షుల మధ్య వివాదం
Comments
Please login to add a commentAdd a comment