హత్యా.. ఆత్మహత్యా?
కొండాపురం : మండల పరిధి లావనూరు–చెన్నమనేనిపల్లె గ్రామాలకు వెళ్లే రోడ్డులోని ఓ కల్వర్టు వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హత్యా.. ఆత్మహత్యా.. అనే విషయం పోలీసులు తేల్చాల్సి ఉంది. స్థానికులు, బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు గ్రామానికి చెందిన చిన్నగుల్లి ఓబన్నగారి బాలయ్య పెద్దకుమారుడు చిన్నగుల్లి ఓబన్నగారి సురేష్(36) మంగవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయనకు చిలమకూరు గ్రామానికి చెందిన వీరకుమారితో 10 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీర కుమారి ఆశా వర్కర్‌గా పని చేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం. సురేష్ ఆటో నడుపుకొంటూ ఎల్లనూరులోనే నివాసం ఉంటున్నారు. సురేష్, వీరకుమారికి మనస్పర్థలు ఉన్నాయి. ఏడాది నుంచి వారు దూరంగా ఉంటున్నారు. కొండాపురం ఎస్‌ఐ విద్యాసాగర్ సురేష్ మృతదేహం వద్దకు చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment