అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బి.కొత్తకోట : మండలంలోని గుమ్మసముద్రం పంచాయతీ గుడ్లవారిపల్లెకు చెందిన విజయనిర్మల (34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సీఐ జీవన్ గంగనాథ్ బాబు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుడ్లవారిపల్లెకు చెందిన జనార్దన్ భార్య విజయనిర్మల సోమవారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్నారు. రాత్రివేళ నిద్రలేచి చూడగా.. అపస్మారక స్థితిలో ఉండటం గమనించి కుటుంబీకులు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు బి.కొత్తకోట సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు విజయనిర్మల అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో విజయనిర్మల తమ్ముడు హరీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యనా, ఆత్మహత్యనా తేల్చేందుకు వారు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు
రైల్వేకోడూరు అర్బన్ : బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ ప్రొహిబిషన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎం.రవి హెచ్చరించారు. స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో సీఐ తులసీ, సిబ్బందితో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వేకోడూరు పరిధిలో బెల్టు షాపులు నిర్వహిస్తే ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మొదటిసారి దొరికితే కఠిన చర్యలు, రెండోసారి దొరికితే నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేసి భారీ జరినామాలు విధించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ జహీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment