పోలీస్ శాఖలో ఎస్‌బీ కీలకం
రాయచోటి : పోలీస్ శాఖలో స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) విభాగం కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. మంగళవారం రాయచోటిలోని జిల్లా పోలీసు సమావేశ మందిరంలో జిల్లాలోని స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కచ్చితమైన సమాచారం వచ్చేలా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. ఇంకా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌లు పి.రాజ, రమేష్, ఏ సత్యనారాయణ, కె. రాజారెడ్డి, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment