రాత్రికి రాత్రే ఇసుక డంప్‌లు ఖాళీ
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ, మర్రిపాడు గ్రామాల పరిఽధిలో ఉన్న రామానాయిని చెరువు, హరిహరాదుల చెరువు పరిసరాల్లో ఉన్న ఇసుక డంప్‌లను రాత్రికి రాత్రే ఇసుకాసురులు ఖాళీ చేశారు. కాగా ఒక చోట సగం ఉన్న ఇసుక డంప్‌ను పోలీస్, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ‘సాక్షి’ల ప్రచురితమైన ‘పగలు తోడేస్తూ.. రాత్రిళ్లు తోలేస్తూ’ అనే కథనంపై అధికారులు స్పందించారు. మంగళవారం రామానాయిని చెరువు పరిసరాల్లోని రుద్రావాండ్లపల్లె, పిల్లగోవులవారిపల్లె, చెరువుమొరవపల్లె, రేగడపల్లె, కొత్తపల్లె గ్రామాల సమీప పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్‌లపై పోలీస్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఇసుకాసురులు రాత్రికి రాత్రే ఇసుక డంప్‌లను ఖాళీ చేసేశారు. ఆయా గ్రామాల పరిధిలో సుమారు పది చోట్ల ఉన్న ఇసుక డంప్‌లను వారు సోమవారం రాత్రే జేసీబీలతో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా బయట ప్రాంతాలకు తరలించేశారు. ఉదయం అధికారులు దాడులు నిర్వహించే సమాయానికే డంప్‌లు ఖాళీ చేసేశారు. మంగళవారం ఉదయం హెడ్‌కానిస్టేబుల్ రమణ, వీఆర్వో నారాయణ తమ సిబ్బందితో కలసి డంప్‌లపై దాడులు నిర్వహించారు. పలుచోట్ల అప్పటికే ఖాళీ చేసిన ఇసుక డంప్‌లను గుర్తించారు. రుద్రావాండ్లపల్లెలో మాత్రం సగం ఖాళీ చేసిన ఇసుక డంప్‌ను గుర్తించి అందులోని నాలుగు ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు సదరు ఇసుకను ఎవరూ కూడా వినియోగించకూడదంటూ తహసీల్దార్ శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు.
ఒక డంప్‌ను సీజ్ చేసిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment