డీఈఓ వెబ్‌సైట్‌లో సీనియారిటీ జాబితా
కడప ఎడ్యుకేషన్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు, పొద్దుటూరు మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎస్‌జీటీ, తత్సమాన కేటగిరీ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతలకు సంబంధించిన తాత్కాలిక సీనియారిటీ జాబితాను www.kadapadeo.in వెబ్‌సైట్‌నందు పొందుపరిచామని డీఈఓ మీనాక్షి తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటు 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తగిన ఆధారాలు, సర్వీసు రిజిస్టర్‌తో స్వయంగా డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని ఆమె తెలిపారు.
రెవెన్యూ సదస్సులతో
భూ సమస్యల పరిష్కారం
● మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
సంబేపల్లె: మండల పరిధిలోని గుట్టపల్లె, శెట్టిపల్లె గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రాష్ట్ర మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ భూమి – మీ హక్కు రెవెన్యూ సదస్సులు ఈ నెల 6నుంచి జనవరి 8వరకు నిర్వహిస్తామన్నారు. గ్రామాలలో నెలకొన్న భూ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అనంతరం భూ సమస్యలపై వచ్చిన అర్జీలను మంత్రి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ నరసారెడ్డి, రవీంద్రారెడ్డి, ప్రభాకర్‌నాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment