![సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/18/17rjpt351-170003_mr-1734467007-0.jpg.webp?itok=bCHMkXqY)
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి
సిద్దవటం: సంక్షేమ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజంపేట ఎమ్మెల్యే , వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి విమర్శించారు. సిద్దవటం మండంలోని టక్కోలు పంచాయతీ డేనగవాండ్లపల్లి గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారన్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం అంటూ తల్లికి పంగనామాలు పెట్టారన్నారు. ప్రజలపై మరింత భారాన్ని మోపుతూ విద్యుత్ చార్జీలను పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట వైఎస్సార్‌సీపీ నాయకుడు సౌమిత్రి, సిద్దవటం మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నారపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, మండల పార్టీ అధికార ప్రతినిధి ఉపాసి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment