పెన్షనర్ల ఆశాజ్యోతి ‘నకారా’
కడప ఎడ్యుకేషన్ : పెన్షనర్ల పాలిట ఆశాజ్యోతి నకారా గారి అవిరళ అని కడప జిల్లా ట్రెజరీ అధికారి వెంకటేశ్వరావు అన్నారు. మంగళవారం కడప జిల్లా ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని పాత రిమ్స్‌లోని బీసీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నకారా కృషి ఫలితమే నేడు విశ్రాంత ఉద్యోగులు పొందుతున్న పింఛన్ విధానమన్నారు. ఆయనను ప్రతి ఒక్క పెన్షనర్ గుర్తుంచుకోవాలన్నారు. ఉప ఖజానా అధికారి రవికుమార్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు జాతి నిర్మాణ సారధులని, వారి అనుభవం అపారమైనదని అన్నారు. వారి సూచనలు ఆచరిస్తే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో రాణిస్తుందన్నారు. కడప జిల్లాలోని పెన్షనర్స్‌కు ఎలాంటి సమస్యలు లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. బీసీ కార్పొరేషన్ ఈడీ జయసింహ, వికలాంగుల, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ కడప పెన్షనర్స్ అసోసియేషన్ చేస్తున్న కృషి అమోఘమన్నారు. వారి న్యాయమైన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తమ వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. జిల్లా ఎన్‌జీఓల సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు, పెన్షనర్స్ సంఘ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మాట్లాడుతూ 1982 డిసెంబర్ 17న జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు వల్ల నేడు విశ్రాంత ఉద్యోగులు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి రామమూర్తి నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాల ఎల్లారెడ్డి జాతీయ పెన్షనర్ల దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. 30 ఏళ్లుగా సంఘ అభివృద్ధి, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమునిరెడ్డి, రాధాకృష్ణ, నగేష్, నారాయణ తెలిపారు. అనంతరం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న 46 మంది పెన్షనర్స్ ను సన్మానించారు. అనంతరం ముద్ర డ్యాన్స్ స్కూల్ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు గానుగపెంట హనుమంతరావు, యోగా మాస్టర్ చలపతి గౌడ్, నారాయణ, సుబ్బారెడ్డి, నాగయ్య, మల్లయ్య, దేవరాజ్, సుభాన్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మస్తాన్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment