గురుకుల ఉపాధ్యాయుల నిరాహార దీక్ష
రాయచోటి అర్బన్ : గిరిజన గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆ ఉపాధ్యాయుల అసోసియేషన్ నేతలు శ్రీనివాసులునాయక్, మహాదేవ్, సరోజ, హరిత మంగళవారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కాంట్రాక్టు టీచర్స్‌గా మార్పు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. వారి దీక్షలకు అంగన్‌వాడీ కార్యకర్తలు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, కార్యదర్శి భాగ్యలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్తలు సిద్దమ్మ, అరుణ, సునీత, రమీజా, సురేఖతోపాటు ఉపాధ్యాయులు విజయకుమారి, స్వర్ణ, లక్ష్మిదేవి, రెడ్డెమ్మ, ప్రదీప్, సౌజన్య, కాదంబరి, గీత, సుధాకర్, సమిత, ప్రకాష్, వనిత, త్రివేణి, కల్పన, సుభాషిణి, సుజాత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment