చెలరేగిన చైన్‌స్నాచర్స్
రాజంపేట : రాజంపేటలో చైన్‌స్నాచర్స్ చెలరేగిపోయారు. పట్టణంలోని పలు దారుల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలనే టార్గెట్ చేసుకున్నారు. మంగళవారం ఆర్‌ఎస్ రోడ్డులోని ఓ ప్రైవేట్‌చిట్స్ కంపెనీలో పని చేస్తున్న మహిళ నూనివారిపల్లె నుంచి తన కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తుండగా.. రాఘవేంద్రస్టోర్ వద్దకు రాగానే గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె గొలుసును గట్టిగా పట్టుకున్నారు. తెగి మెడకు గాయమైంది. దీంతో ఆ ప్రాంత మహిళలు చైన్‌స్నాచర్స్ గతంలో ఓమారు రెచ్చిపోయిన సంఘటనలు గుర్తుచేసుకున్నారు. పట్టణపగలే రోడ్డపై మహిళలు తిరగలేని పరిస్ధితులు నెలకొన్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. అలాగే బోయనపల్లె (రాజంపేట రూరల్ ఏరియా)లో కూడా చైన్‌స్నానర్స్ హల్‌చల్ చేశారు. పలువురు మహిళల గొలుసులు అపహరించేందుకు యత్నం చేశారు. స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నిం చేయడంతో వారు పరారయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.
నిర్మానుష్య ప్రాంతాలపై దృష్టి
పట్టణంలో రద్దీగా లేకుండా ఉండి, నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలపై చైన్‌స్నాచర్స్ దృష్టి పెడుతున్నారు. ఆ ప్రాంతంలో ఒంటరిగా వెళ్లే మహిళలను కొంత దూరం అనుసరించడం, అదనుచూసి బంగారు గొలుసులు లాక్కేళ్లడం జరుగుతోంది. గతంలో నూనివారిపల్లె, ఆర్‌ఎస్‌ఎస్‌రోడ్డుతోపాటు మహిళలు అధికంగా వచ్చే మార్కెట్ ఏరియా, బంగారు దుకాణాలు ఉండే బండ్రాళ్ల వీధి తదితర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తుంటారు. మహిళలు అప్రమత్తంగా ఉండకపోతే.. మెడలోని బంగారుగొలుసులు కోల్పోవాల్సి వస్తుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
ఒకే రోజు రెండు చోట్ల యత్నం
స్థానికులు అడ్డుకోవడంతో విఫలం
Comments
Please login to add a commentAdd a comment