
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
రామసముద్రం : మండలంలోని కురిజల గ్రామానికి చెందిన బొలెరో వాహనం ఢీకొనడంతో కర్నాటక రాష్ట్రం గుడిపల్లె పంచాయతీ నాగేపల్లె, కోనంగుంట గ్రామాలకు చెరందిన ఐదుగురు దుర్మరణం చెందారు. కర్ణాటక రాష్ట్రంలోని ములబాగల్ తాలూకా గుడిపల్లె పంచాయతీ సమీపంలో ఈ సంఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కర్నాటక రాష్ట్రం గుడిపల్లె పంచాయతీ నాగేపల్లెకు చెందిన భార్యాభర్తలు అప్పయ్య(45), గాయత్రి(40), కోనంగుంట గ్రామానికి చెందిన భార్యాభర్తలు వెంకటరమణప్ప(43), అలివేలమ్మ(38), అదే గ్రామానికి చెందిన రాధప్ప(45) కలిసి బైక్‌లపై ములబాగల్‌కు వెళ్తున్నారు. వడ్డిపల్లె నుంచి టమాటా బాక్సులతో వస్తున్న బొలెరో వాహనం ఎదురుగా వచ్చి అతివేగంతో రెండు బైకులను ఢీకొంది. దీంతో అప్పయ్య, గాయత్రి, వెంకటరమణప్ప, అలివేలమ్మ, రాధప్పలు అక్కడికక్కడే మృతిచెందారు. ములబాగల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment