●ముసురుతున్న వ్యాధులు
ప్రతిసారి తుఫాన్లు వచ్చినప్పటి నుంచి చలి విపరీతంగా పెరగడం.. శీతాకాల సీజన్ కావడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. జలుబు, జ్వరాలు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులతో వృద్ధులతోపాటు చిన్నారులు వణికిపోతున్నారు. అంతేకాకుండా ఇతర వ్యాధులు కూడా విస్తరిస్తున్నాయి. తుఫాను ప్రభావం నేపథ్యంలో వ్యాధులతో ఆస్పత్రుల వైపు జనాలు పరుగులు తీస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని రిమ్స్‌తోపాటు రాయచోటిలోని పెద్దాస్పత్రి, మదనపల్లె, ప్రొద్దుటూరులలోని జిల్లా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. రెండు జిల్లాల్లోని మైదుకూరు, బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, పీలేరులోని ప్రైవేటు ఆస్పత్రులు కూడా రోగులతో నిత్యం రద్దీగా మారుతున్నాయి. ప్రధానంగా చలికి తోడు తుఫాను ప్రభావంతో వాతావరణంలో మార్పు ఫలితంగా చిన్నారులు, వృద్ధుల్లో దగ్గు, ఆయాసం ఒక్క ఉదుటున తగ్గకపోవడంతో ఎక్కువ ఆందోళన చెందుతున్నారు.
రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రతిరోజు వచ్చే రోగుల సంఖ్య: 1200
మదనపల్లె, ప్రొద్దుటూరులలో
జిల్లా ఆస్పత్రులకు వచ్చే రోగులు:
1800-2000
రెండు జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు
రోజువారీగా వచ్చే రోగుల సంఖ్య:12 వేలకు పైగానే
Comments
Please login to add a commentAdd a comment