జిల్లాలో విస్తారంగా ఉలవ సాగు
ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈ ఏడాది ఉలవ పంట సాగుపై దృష్టి సారించారు. ఎక్కువమంది పంట సాగుపై ఆసక్తి చూపడంతో ప్రభుత్వం రైతుకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 400 రైతు సేవా కేంద్రాల ద్వారా 80 శాతం రాయితీతో ఉలవలు పంపిణీ చేసింది. దీంతో రైతులు 35, 127 హెక్టార్లలో ఉలవ పంట సాగు చేశారు.
● జిల్లాలో 35,127 హెక్టార్లలో
సాగు చేసిన రైతులు
● 80 శాతం రాయితీతో
14,845 క్వింటాళ్ల పంపిణీ
పీలేరు రూరల్ : ఖరీఫ్ సీజన్‌లో వేరువనగ సాగు చేసుకోలేని రైతులు ఉలవ పంట సాగు చేశారు. జిల్లాలో 63,573 మంది రైతులు దాదాపు 35,127 హెక్టార్లలో గత సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రైతులు పంట సాగు చేశారు. ఎకరాకు నాలుగు నుంచి ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి లభిస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా ఉలవలు రూ.5 వేల ధర పలుకుతున్నాయి. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 7534 హెక్టార్లు కాగా, అందుకు నాలుగింతలు అధికంగా ఈ ఏడాది ఉలవ సాగు చేశారు. వాతావరణం బాగా అనుకూలించడంతో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు, రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా ఉలవ సాగు
నియోజకవర్గం హెక్టార్లు
పీలేరు 7790
మదనపల్లె 3973
తంబళ్లపల్లె 14456
రాయచోటి 7214
రాజంపేట 1694
Comments
Please login to add a commentAdd a comment