మహిళ అదృశ్యం
గాలివీడు : పట్టణంలోని పెద్దూరులో నివాసముంటున్న గుండ్లూరి రత్నమ్మ కనిపించలేదంటూ ఆమె భర్త ఆంజనేయులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి రత్నమ్మ కనిపించలేదు. మతిస్థిమితం సరిగా లేని కారణంగా బయటికి వెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ తెలిస్తే 7569690966 సెల్ నెంబర్‌కు సమాచారం అందించాలని వారు కోరారు.
సోషల్ మీడియా యాక్టివిస్ట్ సుధారాణికి బెయిల్ మంజూరు
మదనపల్లె : సోషల్ మీడియా యాక్టివిస్ట్ సుధారాణిపై అన్నమయ్య జిల్లా మదనపల్లె టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో బుధవారం రెండో ఏడీఎం కోర్టు న్యాయమూర్తి ర్యెగులర్ బెయిల్ మంజూరు చేశారు. సుధారాణి తరపున లాయర్ ప్రసాదరెడ్డి న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. దీంతో సుధారాణికి ర్యెగులర్ బెయిల్ మంజూరైంది. పీటీ వారెంట్‌లో భాగంగా సుధారాణిని ఈనెల 12న నరసారావుపేట నుంచి తీసుకువచ్చి మదనపల్లె పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసు విచారణ తర్వాత 13వ తేదీన న్యాయమూర్తి ఎదుట హాజరుపరిస్తే ఈనెల 26 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆమెను పోలీసులు తిరిగి నరసారావుపేటకు తీసుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి దాఖలైన బెయిల్ పిటిషన్ విచారణలో సుధారాణికి ర్యెగులర్ బెయిల్ మంజూరైంది.
బేస్‌బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
చిన్నమండెం : చిన్నమండెం మోడల్ స్కూల్‌లో ఎంపీసీ చదువుతున్న ఎ.వైష్ణవి, సీఈసీ చదువుతున్న వై.శ్రీహరినాయుడు ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ వి.రమేష్ తెలిపారు. ఈ నెల 14, 15, 16వ తేదీలలో గుంటూరు జిల్లా సత్తెనపల్లె సమీపంలోని లయోలా కాలేజీలో జరిగిన అండర్–19 రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీలలో వారు ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ కె.రామాంజనేయులు, విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
బద్వేల్ మున్సిపల్
వైస్ చైర్మన్ అరెస్టు
మైదుకూరు : బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రగొల్ల గోపాలస్వామిని అరెస్టు చేసినట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద ప్రసాద్ తెలిపారు. డీఎస్పీ తెలిపిన మేరకు.. గోపవరం మండలం ఎల్లారెడ్డి పేటకు చెందిన మేడిమెల సుశీల భర్త రత్నం 2018లో మృతి చెందాడు. అయితే అతను బతికి ఉన్నట్టు ఫోర్జరీ ఆధార్ సృష్టించి అతని పేరుతో ఉన్న చెన్నంరెడ్డిపల్లె పొలం సర్వే నంబర్ 1754/2లోని 1.02 ఎకరాల పొలాన్ని గోపాలస్వామి, డ్రైవర్ లక్ష్మీనారాయణ పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆ విషయంపై రత్నం భార్య మేడిమెల సుశీల ఫిర్యాదు చేశారు. ఆ మేరకు బుధవారం ఎర్రగొల్ల గోపాలస్వామిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment