ఉద్యోగుల బకాయిలు చెల్లించకుంటే ఉద్యమం
రాజంపేట టౌన్ : ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎస్టీయూ రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంరాజు, జిల్లా అధ్యక్షుడు అంకం శివారెడ్డి హెచ్చరించారు. స్థానిక మన్నూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ రీజనల్ కన్వీనర్ నరసింహులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, సరెండర్ లీవ్, మెడికల్ రీ అంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. 117 జీవో రద్దును స్వాగతిస్తున్నామని, హైస్కూల్ ప్లస్ స్థానంలో జిల్లా పరిషత్ జూనియర్ కళాశాల ఏర్పాటుచేసి ఉపాధ్యాయులకు రెండు ఇంక్రిమెంట్లతో పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలుత నిరసనలు, ఆందోళనలు చేపడతామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాలు చేసేందుకు వెనకాడబోయేది లేదని తెలిపారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు ఓబులేసు, రాధాకృష్ణ, శ్రీనివాసవర్మ, సర్తాజ్‌లను ఎస్టీయూ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లం అశోక్‌కుమార్, ఎల్లయ్య, మురళీ మనోహర్, శ్రీనివాసులు, రవిశంక్‌రెడ్డి, నాగరాజు, పిల్లి రామకృష్ణ, నరేంద్ర, గోపాల్, సత్యనారాయణ, స్వామినాథ్, యానాదయ్య, గంగాధర్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయూ రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు
సుబ్రహ్మణ్యంరాజు
Comments
Please login to add a commentAdd a comment