రూ.18 లక్షల రికవరీకి నోటీసులు సిద్ధం
పెద్దతిప్పసముద్రం : రుణాలు పొంది చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బకాయిపడిన సభ్యులకు నోటీసులు అందజేసేందుకు అధికారులు బ్యాంకు సంసిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే పెద్దతిప్పసముద్రం కేంద్రంగా బి.కొత్తకోట మండలానికి సంబంధించి గొర్రెలు, మేకల రైతు ఉత్పత్తిదారుల పరస్పర సంఘంలో 184 రైతు సంఘాల గ్రూపులున్నాయి. ఇందులో 1,923 మంది రైతులు సభ్యులుగా కొనసాగుతూ రుణాలు పొందుతున్నారు. సదరు గ్రూపు సభ్యుల లావాదేవీలు, బ్యాంకుల నుంచి మంజూరైన రుణాలు, చెల్లించిన రుణాలు, పొదుపు లావాదేవీలకు సంభంధించి ఏటా ఏప్రిల్‌లో ఆడిట్ నిర్వహిస్తారు. ఇటీవల జరిగిన ఆడిట్‌లో 23 గ్రూపులకు సంభంధించి రూ.18,32,041ల రుణాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సదరు మొండి బకాయిదారుల నుంచి రుణాల రికవరీ కోసం ఇన్‌చార్జి ఏపీఎం, కార్యదర్శితో పాటు అధ్యక్షుడి సంతకాలతో నోటీసులను అందజేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. అయితే సమాచారం లేకుండా కొంత మంది లీడర్లు సభ్యులను ఏమార్చి వారి నుంచి సంతకాలు తీసుకుని దొడ్డిదారిలో రుణాలు పొందారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గొర్రెలు, మేకల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ గ్రూపులోని సభ్యులు సంతకాలు చేసే ముందు అధికారుల సూచనలు తీసుకోవాలని, ప్రభుత్వం అందజేస్తున్న రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment