రాయచోటి: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ రాష్ట్ర ఉత్తమ నేర పరిశోధన కేసులకు గాను ఇచ్చే ప్రతిష్టాత్మక ఏబీసీడీ అవార్డు అన్నమయ్య జిల్లా దిశ పోలీసు స్టేషన్ సీఐ రవిశంకర్‌రెడ్డికి దక్కింది. బుధవారం విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో చిత్తూరు జిల్లా ఎస్పీ వీన్ మణికంఠ చందోలుతో కలిసి డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది జులై 7వ తేదీన చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో జరిగిన ఏటీఎం దొంగతనం కేసులో కరడుగట్టిన అంతర్‌రాష్ట్ర నేరస్తుడిని అరెస్టు చేసినందుకు ప్రతిష్టాత్మక ఏబీసీడీ అవార్డులో మొదటి స్థానంలో ఎంపికయ్యారు. అప్పట్లో చిత్తూరు వెస్ట్ సీఐగా పనిచేస్తున్న రవిశంకర్‌రెడ్డి ప్రస్తుతం అన్నమయ్య జిల్లా దిశ స్టేషన్ సీఐగా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment