అమిత్‌షా క్షమాపణ చెప్పాలి
రాయచోటి అర్బన్ : రాజ్యసభలో జరిగిన చర్చలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను కించపరిచేలా మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా వెంటనే భారత జాతికి క్షమాపణలు చెప్పాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. అంబేడ్కర్‌పై వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రజాసంఘాల నేతలు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి అయిన అంబేడ్కర్ గురించి అమిత్‌షా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా అమిత్‌షా తన మనువాద దృక్పథాన్ని బయటపెట్టారన్నారు. కోట్లాది దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆత్మగౌరవానికి అంబేడ్కర్ ప్రతీక అన్నారు. ఆయనను అవమానిస్తే దేశ ప్రజలను అవమానించేనట్లే అన్నారు. అమిత్‌షాకు హోం మంత్రిగా కొనసాగే హక్కులేదని తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్‌షా వ్యాఖ్యలను ప్రజాతంత్రవాదులు, మేధావులు, లౌకిక, సామాజిక వాదులంతా ఖండించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు, ఎంఆర్‌పీఎస్ నాయకుడు రామాంజులు, గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథనాయక్, బాస్ రాష్ట్ర కార్యదర్శి పలం తాతయ్య, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డెయ్య, డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి సుధీర్‌కుమార్, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకుడు శంకర్‌నాయక్, ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు కోటేశ్వరరావు, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా కార్యదర్శి జగన్, దళిత నాయకులు పామయ్య, రాజారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నిరసన ప్రదర్శనలో ప్రజాసంఘాల నేతలు
Comments
Please login to add a commentAdd a comment