విద్యుత్ సవరణల బిల్లును ఉపసంహరించుకోవాలి
రాయచోటి (జగదాంబసెంటర్) : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సవరణల 2022 బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని ఏపీఎస్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం వద్ద విద్యుత్ సంస్థను ప్రైవేటీకరణ చేయకూడదని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ చంఢీగఢ్, ఉత్తరప్రదేశ్‌లలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ జేఏసీ నాయకులు పురుషోత్తం, భాస్కర్‌నాయుడు, చిరంజీవి, నరసింహులు నాయక్, లక్ష్మీపతి, చంద్రశేఖర్, సుబ్రమణ్యంరాజు, ఏవీ రమణ, రాయచోటి, పీలేరు, మదనపల్లి, రాజంపేట డివిజన్ల జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment