చిరుద్యోగులపై కూటమి నేతల కక్ష సాధింపు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : చాలా ఏళ్లగా సంఘమిత్రలుగా పని చేస్తున్న చిరుద్యోగులపై కూటమి నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా బి.కొత్తకోట మండలానికి చెందిన పలువురు సంఘ మిత్రలను తొలగించడం వివాదానికి దారి తీసింది. బి.కొత్తకోట మండలానికి చెందిన సంఘమిత్రలు లక్ష్మినరసమ్మ, ఈశ్వరమ్మ, భారతిలను స్థానిక కూటమి నాయకులు తంబళ్లపల్లె టీడీపీ నేత దాసరపల్లి జయచంద్రారెడ్డిపై ఒత్తిడి చేసి తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న సంఘమిత్రలు, పలువురు మహిళా సభ్యులు బుధవారం ములకలచెరువుకు వచ్చారు. సుమారుగా 50 మంది మహిళలు జయచంద్రారెడ్డి నివాసం వద్దకు చేరుకొని ముట్టడించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమని ఏ కారణంతో తొలగించారో చెప్పాలని నిలదీశారు. ఆగ్రహించిన జయచంద్రారెడ్డి మీరు వైఎస్సార్‌సీపీకి పని చేశారు.. కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయించలేదు.. ఒక్కసారి తొలగించాక చేర్చుకునేదిలేదని వారిపై ఊగిపోయారు. అనంతరం మహిళలు జయచంద్రారెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఏ ప్రభుత్వం వచ్చినా మా విధులు చేయక తప్పదు. .ప్రభుత్వాలు అమలు చేసే పథకాల్లో భాగస్వాములవుతాము.. ప్రభుత్వం తరపున ప్రచారాలు చేస్తాము.. దీనికే మమ్మల్ని తొలగించడం తగదు అంటూ వాదించారు. మా లాంటి చిరుద్యోగులపైన కుటుంబాలు ఆధారపడి ఉంటాయి.. మా కడుపులు కొట్టోదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి తప్పులు, ఆరోపణలు లేకుండా తొలగించడం సరికాదన్నారు. ఆయన సానుకూలంగా స్పందించకపోవడంతో అక్కడి నుంచి వెను తిరుగుతూ తమను విధుల్లోకి తీసుకోకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించి వెళ్లారు.
వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేయించారనే నెపంతో తొలగింపు
ఆగ్రహించిన సంఘమిత్రలు,
మహిళా సభ్యులు
టీడీపీ నేత డి. జయచంద్రారెడ్డి ఇంటి ముట్టడి
Comments
Please login to add a commentAdd a comment