రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా.?
రైల్వేకోడూరు అర్బన్ : కడప– రేణిగుంట జాతీయ రహదారి గుంతలమయమై ప్రతి రోజు రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రోడ్ల గురించి దుష్ప్రచారం చేసి అధికారం చేపట్టాక సంక్రాంతి లోపు రోడ్లు బాగు చేస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇప్పుడు ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తున్నా ఒక్కరోడ్డు కూడా బాగు చేయలేదన్నారు. ఇప్పటికే ప్రజలు చంద్రబాబు పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నారు. టీడీపీ, జనసేన మంత్రులు, నాయకులు కేవలం ప్రెస్‌మీట్లు, సమీక్షలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు, నిత్యావసర ధరలు అధికంగా పెంచడం దారుణమన్నారు. ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, సీహెచ్ రమేష్, ఆర్వీ రమణ, జనార్దన్‌రాజు, హరికృష్ణారెడ్డి, బండారు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
Comments
Please login to add a commentAdd a comment