●నిశితంగా పరిశీలించాకే...
సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుంటే...మోసగాళ్లు అంతే వేగంగా నయా మోసాలకు దారులు వెతుక్కుంటున్నారు. ప్రతిదీ టెక్నాలజీమయం అయిన ప్రస్తుత కాలంలో నేరగాళ్లు ఆన్‌లైన్‌ను ఆసరాగా చేసుకుని సరికొత్త సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులకు పంపించే శుభాకాంక్షలు, కొత్త ఏడాది సందర్భంగా వివిధ కంపెనీలు ప్రకటించే ఆఫర్లను మోసాలకు మార్గాలుగా ఎంచుకుంటున్నారు. కొన్ని బోగస్ లింక్‌లను, ఏపీకే ఫైల్స్‌లను పంపి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిపై ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
నూతన ఏడాది సందర్భంగా మన ఫోన్లకు వచ్చే రకరకాల గిఫ్ట్ ఓచర్లు, గ్రీటింగ్స్, ట్రావెల్ గ్యాడ్జెట్స్, ఫ్యాషన్లపై ఇచ్చే డిస్కౌంట్లను ఒకటికి నాలుగుసార్లు నమ్మదగినవా? కాదా? అన్నది పరిశీలన చేసుకోవటం అత్యవసరం. వాటి రివ్యూస్ చూస్తూ వెరిఫైడ్, అథెంటిక్ వెబ్‌సైట్లలోకి వెళ్లి ఆఫర్లను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment