కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రతి ఏడాది శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య ఉమ్మడి జిల్లాలో పెరుగుతూ వస్తోంది. వీరికోసం రైల్వేశాఖ అధికారులు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెలలో కడప మీదుగా ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
ప్రత్యేక రైళ్లు
అయ్యప్పభక్తులతోపాటు ఇతర ప్రయాణికుల కోసం 07151 నెంబరుగల కాచిగూడ నుంచి రైలు కొట్టాయంకు జనవరి 2, 9, 16, 23 తేదీల్లో ప్రయాణిస్తుంది.
● 07152నెంబరుగల రైలు కొట్టాయం నుంచి కాచిగూడకు జనవరి 3, 10, 17, 24 తేదీల్లో బయలుదేరుతుంది.
● 07065 నెంబరుగల రైలు హైదరాబాదు నుంచి కొట్టాయంకు జనవరి 7, 14, 21, 28 తేదీల్లో నడుస్తుంది.
● 07066 నెంబరుగల రైలు కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు జనవరి 8, 15, 22, 29 తేదీల్లో , 07183 నెంబరుగల రైలు నర్సాపురం నుంచి కొల్లాంకు జనవరి 15, 22 తేదీలలో బయలుదేరుతుంది.
● 07184 నెంబరుగల రైలు కొల్లాం నుంచి నర్సాపురానికి జనవరి 17, 24 తేదీలలో ప్రయాణిస్తుంది.
టిక్కెట్ల వివరాలు
కడప నుంచి కొట్టాయంకు జనరల్ టిక్కెట్ రూ. 265, స్లీపర్ రూ. 565, త్రీ టైర్‌ఏసీలో రూ. 1595, టు టైర్ ఏసీలో 2010గా నిర్ణయించారు. కడప నుంచి కొల్లాంకు జనరల్ రూ. 285, స్లీపర్ రూ. 595, త్రీ టైర్‌లో రూ.1680, టు టైర్‌లో రూ. 2240గా నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment