సదరం క్యాంపులకు సడన్ బ్రేక్!
మదనపల్లె సిటీ: దివ్యాంగులపై కుట్రకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వారికి అందించే పింఛన్‌లో భారీగా కోత విధించాలని ఆలోచిస్తోంది. ఒకవైపు ఉన్న వారిని తగ్గించడంతో పాటు తనిఖీల పేరుతో కొత్త లబ్ధిదారులకు పింఛన్ పొందే అవకాశం లేకుండా చేస్తోంది. ఇందులో భాగంగా జనవరి ఒకటో తేదీ నుంచి సదరం సర్టిఫికెట్ల జారీకి బ్రేక్ వేసింది. దీంతో ఈ ప్రక్రియ నిలిచిపోనుంది. దీని వల్ల దివ్యాంగ పింఛన్ కోసం కొత్తగా ఎవరూ దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి.
సదరం కీలకం
దివ్యాంగ పింఛన్‌కు సదరం సర్టిఫికెట్ ఎంతో కీలకం కానుంది. ఇది లేకుండా పింఛన్ పొందే అవకాశం లేదు. ఆర్థోపెడిక్, అంధత్వం, వినికిడి, మానసిక రుగ్మతలు, శారీరక వైకల్యం, మానసిక, శారీరక లోపాలు, దృష్టి లోపంతో బాధపడే వారి వైకల్యాన్ని నిర్ధారిస్తూ సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఉంటేనే దివ్యాంగులకు పింఛను, ఉద్యోగాల భర్తీ, బస్‌పాస్, ఇతర సదుపాయాలు వర్తిస్తాయి. ఈ సర్టిఫికెట్ లేకపోతే దివ్యాంగులుగా గుర్తించే అవకాశం లేదు. తాజాగా పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దివ్యాంగులు మిగిలిన రాయితీలు, సౌకర్యాలు పొందలేని పరిస్థితి నెలకొంది. దీంతో దివ్యాంగుల్లో కలవరం మొదలైంది.
వారంలో 150 మందికిపైగా దరఖాస్తు
జిల్లాలో రాయచోటి, మదనపల్లె, రాజంపేట, తంబళ్లపల్లె, పీలేరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. వారంలో సుమారు 150కిపైగా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన 15 రోజుల్లో సర్టిఫికెట్లు ఆన్‌లైన్ ద్వారా జారీ అయ్యేవి.
3 నుంచి తనిఖీలు
ఈనెల 3వతేదీ నుంచి సదరం సర్టిఫికెట్ ద్వారా పింఛన్లు పొందుతున్న వివరాలపై సర్వే చేయనున్నారు. సదరం సర్టిఫికెట్ ద్వారా మంచానికి పరిమితమైన పలువురికి, 80 శాతం నుంచి వంద శాతం వైకల్యం ఉన్న వారికి నెలకు రూ.15 వేలు పింఛను అందజేస్తున్నారు. దివ్యాంగుల్లో కేటగిరిని బట్టి రూ.5 వేలు, రూ.10వేలు, రూ.15వేలు చొప్పున ఇస్తున్నారు. కిడ్నీ డయాలసిస్ రోగులకు రూ.15 వేలు పింఛను అందజేస్తున్నారు.
సచివాలయాల చుట్టూ
తిరుగుతున్న దివ్యాంగులు
సదరం సర్టిఫికెట్ల స్లాట్ బుకింగ్ కోసం దివ్యాంగులు రోజూ ఆయా పరిధిలోని సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సైట్ నిలిపివేశారని, ఓపెన్ అయితే చెబుతామని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు.
జిల్లాలో సదరం సర్టిిఫికెట్లు
జారీ చేసే ఆస్పత్రులు
దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లపై కూటమి కుట్ర
సచివాలయాల చుట్టూ తిరుగుతున్న దివ్యాంగులు
మదనపల్లె జిల్లా ఆస్పత్రి
రాయచోటి సీహెచ్‌సీ
పీలేరు సీహెచ్‌సీ
రాజంపేట సీహె చ్‌సీ
పీలేరు సీహెచ్‌సీ
తంబళ్లపల్లె సీహె చ్‌సీ
Comments
Please login to add a commentAdd a comment