కొత్త ఏడాది కిక్కే.. కిక్కు!
రాయచోటి: నూతన సంవత్సర సంబరాల పేరుతో అన్నమయ్య జిల్లాలో 10 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 117 మద్యం షాపుల్లో మూడు రోజుల్లోనే ఈ మద్యం విక్రయాలు జరిగినట్లు జిల్లా ఎకై ్సజ్ ప్రొహిబిషన్ అధికారి మధుసూదన్ రావు తెలిపారు. సోమవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు పది కోట్ల రూపాయల మద్యాన్ని షాపుల ద్వారా భారీగా విక్రయించారు. ఇందులో 12352 లిక్కర్ కేసులు, 6838 బీరు కేసులు అమ్ముడు పోయాయి. సోమవారం రూ. 3.17 కోట్లు, మంగళవారం రూ. 5.83 కోట్లు, బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కోటి రూపాయలు విలువజేసే మద్యాన్ని మందుబాబులు సేవించారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం పాలసీలు సవరించింది. గతంలో ఉన్న పాలసీలో మార్పులు చేస్తూ ప్రైవేటు నిర్వహణకు మద్యం షాపులను అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు నిర్వహణలోని మద్యం షాపుల్లో అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
భారీగా మద్యం విక్రయాలు
అన్నమయ్య జిల్లాలో రూ. 10 కోట్ల మద్యం తాగేశారు
మద్యం కల్తీతో మత్తు ఎక్కలేదంటున్న మందు బాబులు
Comments
Please login to add a commentAdd a comment