ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత
● టీటీడీ వీజీఓ సదాలక్ష్మీ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల–తిరుపతి దేవస్థానం విజిలెన్స్ గెజిటెడ్ ఆఫీసర్ (వీజీఓ) సదాలక్ష్మీ తెలిపారు. శుక్రవారం ఆమె అధికారులతో కలిసి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రామాలయంలోని అంతరాలయం, రంగ మండపాన్ని, కల్యాణవేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. ఏప్రిల్ మాసంలో జరగబోయే వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆలయం వద్ద పెట్రోలింగ్ నిర్వహించాలని, తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ విజిలెన్స్ భద్రతా సహాయాధికారి (ఏవీఎస్‌ఓ) సతీష్ కుమార్, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు ఆహ్వానం
మదనపల్లె సిటీ: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని తహురాసమర్‌కు అరుదైన అవకాశం లభించింది. ఈనెల 26న సాయంత్రం 4.30 గంటలకు విజయవాడలోని గవర్నర్ కార్యాలయంలో జరిగే అట్ హోమ్ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితురాలుగా పాల్గొనాలని గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది.గతేడాది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో 98% మార్కులు సాధించింది. తహురాసమర్‌కు ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణమూర్తి రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ (రూటా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పఠాన్ మహమ్మద్‌ఖాన్ అభినందనలు తెలిపారు. కాగా తహూరాసమర్ ప్రస్తుతం స్థానికంగా ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment