మాజీ ఎమ్మెల్యే శంకర్‌ వర్గీయులపై కేసు | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే శంకర్‌ వర్గీయులపై కేసు

Published Sat, Jan 25 2025 1:05 AM | Last Updated on Sat, Jan 25 2025 1:04 AM

మాజీ

మాజీ ఎమ్మెల్యే శంకర్‌ వర్గీయులపై కేసు

బి.కొత్తకోట : తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌ యాదవ్‌ వర్గీయులపై అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. నారా లోకేష్‌ జన్మదినం సందర్భంగా బుధవారం రాత్రి బి.కొత్తకోటలో శంకర్‌ వర్గీయులు బ్యానర్లను ఏర్పాటు చేశారు. తెల్లారేసరికల్లా ఇవి చిరిగిపోయి ఉన్నాయి. ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి వర్గీయులే చేసి ఉంటారని శంకర్‌ వర్గీయులు ఆరోపించారు. సోషల్‌ మీడియాలోనూ ఇదే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చెన్నక అరుణ్‌ కుమార్‌ అనే వ్యక్తి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో నారా లోకేష్‌ బ్యానర్లను శంకర్‌ వర్గీయులు కట్టారని, వాటిని వారే చింపేసి ఆ నిందను జయచంద్రారెడ్డిపై వేశారని పేర్కొన్నారు. శంకర్‌కు కోవర్టుగా పనిచేస్తూ జయచంద్రారెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు బి.కొత్తకోట, పెద్దతిప్ప సముద్రం, ములకలచెరువు, తంబళ్లపల్లె మండలాలకు చెందిన సాగర్‌ కుమార్‌, నాగార్జున, సుదర్శన్‌ రెడ్డి, పురుషోత్తం, రాజా, సుదర్శన్‌, కురవ ప్రకాష్‌, సురేష్‌ యాదవ్‌ లపై సీఐ జీవన్‌ గంగనాథ్‌ బాబు కేసు నమోదు చేశారు.

దర్గా స్వామిజీ ఆరాధన

రామాపురం : మండలంలోని నీలకంట్రావుపేట సమీపంలో వెలసిన దర్బార్‌ సాయి నగరంలో దర్గా స్వామిజీ ఆరాధన శుక్రవారం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి గంగ పూజ, కలశ పూజ, పుణ్యాహవచనం, రుద్రాభిషేకం, మంగళహారతి, సాయంత్రం రుద్రాభిషేకం, పల్లకి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెంగళూరుకు చెందిన వేద పండితులచే పూజలు జరిపినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

గొర్రెల మృతికి

పీపీఆర్‌ వ్యాధి కారణం

ఒంటిమిట్ట : మండలంలోని నరవకాటిపల్లిలో పదుల సంఖ్యలో గొర్రె పిల్లలు మృతి చెందడానికి పీపీఆర్‌ వ్యాధి కారణమని పశుసంవర్ధక శాఖ కడప డివిజన్‌ ఉప సంచాలకులు రమణయ్య తెలిపారు. నరవకాటిపల్లి గ్రామానికి ఆయనతోపాటు వ్యాధి నిర్దారణ ప్రయోగశాల ఏడీ డాక్టర్‌ రాజశేఖర్‌, వైద్యాధికారి డాక్టర్‌ సంధ్యా రాణి, ఒంటిమిట్ట ఏడీ ఉమ చేరుకుని విచారించారు. గొర్రెల స్వాబ్స్‌ నమూనా తీసుకొని వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గొర్రె పిల్లలు పీపీఆర్‌ వ్యాధితో చనిపోయాయని, మరిన్ని గొర్రెలకు వ్యాధి సోకిందన్నారు. మరిన్ని పరీక్షలకోసం నమూనాలను విజయవాడకు తరలించామని వివరించారు, గొర్రె పిల్లలను బహిరంగ ప్రదేశాలలో కాకుండా మంచుకు, చలికి రక్షణ కల్పించే విధంగా చూసుకోవాలని పోషకదారులకు సూచించారు.

కల్లుగీత కార్మికులకు

11 మద్యం దుకాణాలు

రాయచోటి టౌన్‌ : అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 11 మద్యం దుకాణాలు కేటాయించినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ రామకూరి తెలిపారు. కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా శుక్రవారం దుకాణాలు కేటాయించారు. గీత కులాలలోని గౌడ, ఈడిగ, గౌండ్ల, గౌడ్‌ వంటి ఉప కులాల వారికి బహిరంగ లాటరీ పద్ధతిలో కేటాయించారు. రాయచోటి, మదనపల్లె, రాజంపేటలతోపాటు మొత్తం 11 షాపులకు ఈ లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్‌ శాఖ అధికారులు, కల్లుగీత కులాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

పోక్సో కేసులో నిందితుడు అరెస్టు

మదనపల్లె : ఫోక్సో కేసులో మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి మోసం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు టూటౌన్‌ ఎస్‌ఐలు రహీముల్లా, గాయత్రి తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. మదనపల్లె గొల్లపల్లి బాలాజీనగర్‌లో నివాసముంటున్న ఓ మైనర్‌ బాలిక (17), స్థానిక ప్రభుత్వ మహిళల జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. గుర్రంకొండ మండలం అమిలేపల్లికి చెందిన ఆనంద్‌ కుమారుడు చరణ్‌తేజ(19) నెల్లూరులో బి.ఫార్మసీ చదువుతున్నారు. స్నాప్‌చాట్‌ సోషల్‌ మీడియా వేదికగా వీరిద్దరికీ పరిచయం పెరిగింది. నిందితుడు చరణ్‌తేజ మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి ఈ నెల 9వతేదీన తనతోపాటు తీసుకువెళ్లాడన్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సొ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. పట్టణంలోని రెడ్డప్ప నాయుడు కాలనీలో శుక్రవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మాజీ ఎమ్మెల్యే  శంకర్‌ వర్గీయులపై కేసు 1
1/3

మాజీ ఎమ్మెల్యే శంకర్‌ వర్గీయులపై కేసు

మాజీ ఎమ్మెల్యే  శంకర్‌ వర్గీయులపై కేసు 2
2/3

మాజీ ఎమ్మెల్యే శంకర్‌ వర్గీయులపై కేసు

మాజీ ఎమ్మెల్యే  శంకర్‌ వర్గీయులపై కేసు 3
3/3

మాజీ ఎమ్మెల్యే శంకర్‌ వర్గీయులపై కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement