ఎర్రచందనం అక్రమార్కులకు జైలు శిక్ష
– జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు
రాయచోటి : ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న కేసులో ముగ్గురు నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2016లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న అన్నమయ్య జిల్లా కెవిపల్లి మండలం సంగటివారిపల్లికి చెందిన సంగటి చిన్నయ్య(47), సంగటి సహదేవ(33), సంగటి వీరభద్ర(30)లను అప్పటి కెవీ.పల్లి పోలీస్ స్టేషన్‌ఎస్‌ఐ వి.సుమన్ పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అన్ని కోణాల్లో ఎస్‌ఐ కెవీ.శివకుమార్ దర్యాప్తు చేసి సమగ్ర నివేదిక కోర్టుకు సమర్పించారన్నారు. ఆ నివేదిక ఆధారంగా తిరుపతి జిల్లా ఆర్‌ఎస్‌ఎస్ ఏజేడీ న్యాయమూర్తి నరసింహమూర్తి ముగ్గురు నిందితులకు ఐదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. అక్రమ రవాణా చేసే వారికి ఈ తీర్పు ఒక గుణపాఠం కావాలని ఎస్పీ అభిప్రాయపడ్డారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.కోటేశ్వర్‌రెడ్డి, రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు బి.రాఘవరెడ్డి, టి.మధు, అప్పటి దర్యాప్తు అధికారి కెవీ.పల్లి ఎస్‌ఐ వి.సుమన్, ఎస్‌ఐ కెబీ.శివకుమార్, కానిస్టేబుళ్లు కె.ఆదినారాయణ, కె.శ్రీనివాసులును ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.
హంద్రీ–నీవా కాల్వ
సామర్థ్యం పెంచాలంటూ ధర్నా
రాయచోటి అర్బన్ : హంద్రీ–నీవా కాల్వ సామర్థ్యాన్ని పది వేల క్యూసెక్కులకు పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. రాయచోటి కలెక్టరేట్ ఎదుట సీపీఐ కార్యకర్తలతో కలిసి శుక్రవారం ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ హంద్రీ–నీవా కాల్వ విస్తరణ పనులు వెంటనే చేపట్టాలన్నారు. హంద్రీ–నీవా ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 80వేలు, అనంతపురంలో 3,45,000, కడప జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లా 1.40వేల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. వర్షాకాలంలో వరదనీటిని ఎక్కువగా తీసుకునే సామర్థ్యం కాల్వకు లేదని, 10 వేల క్యూసెక్కులకు పెంచుతామంటూ 2019లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడైనా నెరవేర్చాలన్నారు. అవసరమైన నిధులను వెంటనే రాష్ట్ర బడ్జెట్ నుంచి విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్.నరసింహులు, సహాయ కార్యదర్శి మహేష్, వంగిమళ్ల రంగారెడ్డి, సాంబశివ, సిద్దిగాళ్ల శ్రీనివాసులు, శివరామక్రిష్ణ, సుమిత్రమ్మ, మనోహర్‌రెడ్డి, సుధీర్‌కుమార్, జ్యోతి చిన్నయ్య, మురళి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
హమాలీలకు వేతనం పెంచాలి
రాజంపేట రూరల్ : పౌర సరఫరాల విభాగంలో పనిచేసే హమాలీలకు వేతనం పెంచాలని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి ఇ.సిఖిందర్ డిమాండ్ చేశారు. రాజంపేట తహశీల్దారు కార్యాలయం వద్ద, లక్కిరెడ్డిపల్లెలోని సివిల్ సప్లయ్ గోదాములు శుక్రవారం మూసివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఖిందర్ మాట్లాడుతూ సివిల్ సప్‌లై కార్పోరేషన్‌ను పాలక ప్రభుత్వాలు నిర్వీర్వం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సూరి, కార్యదర్శి రాఘవేంద్ర, నాయకులు ప్రసాద్, కోదండం, చౌడయ్య, ఈశ్వర్, రామాంజనేయులు, జమాల్, వెంకటేష్, గంగన్న, వీరన్న, కొమటీ, శ్రీను పాల్గొన్నారు.
లక్కిరెడ్డిపల్లి : హమాలీలకు వేతనం పెంచాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దిగాళ్ల శ్రీనివాసులు తెలిపారు. స్థానిక సివిల్ సప్లయ్ గోదాము మూసి మోకాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్లకోసారి కూలీ రేట్లు పెంచాల్సి ఉండగా పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో యు.జగదీష్, షఫీ ఉల్లా, ముభారక్, తాజ్ బాబా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment