చంద్రబాబును ప్రజలు ఎన్నటికీ నమ్మరు
రైల్వేకోడూరు అర్బన్ : సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ గడచిన ఏడు నెలల్లో పేదలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే పాలన చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కొండూరు అజయ్‌బాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో సంక్షేమ పథకాల నగదు నేరుగా మహిళల ఖాతాకు చేరిందన్నారు. చంద్రబాబు పేదలకు పథకం ప్రయోజనాలివ్వకుండా మోసం చేస్తూ నెలకు ఓ నాటకం రక్తి కట్టిస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు ఇచ్చినట్లు ప్రకటించారని, సంక్షేమం, అభివృద్ధి చేయకుండా ఆ నిధులు ఏదారిలో వెళ్లాయో తెలపాలన్నారు. ప్రజలను మరిచి కేవలం తన కొడుకు లోకేష్ సంక్షేమం కోసం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. అప్పట్లో వైఎస్సార్, వైఎస్ జగన్ రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారని, కానీ చంద్రబాబు తన కుటుంబానికి, తన అనుయాయులకు మేలు కలిగేలా పాలన చేస్తున్నారని తెలిపారు. తెలంగాణా సీఎం రేవంత్‌రెడ్డి రూ.లక్షా 70 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని, కర్ణాటక వాళ్లు రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారని, చంద్రబాబు ఏ మేరకు తెచ్చారో చెప్పాలన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి
మాజీ మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డిని లేపేస్తానని బహిరంగంగా హెచ్చరించిన మాజీ జడ్జి రామకృష్ణ వ్యాఖ్యలు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాల ఆయన కోరారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్‌రెడ్డి, సీహెచ్.రమేష్, శివారెడ్డి, రత్తయ్య, దాడిశెట్టిసిద్దూ, గల్లా శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
కొరముట్ల శ్రీనివాసులు
Comments
Please login to add a commentAdd a comment