సహకార బ్యాంకుకు భూరి విరాళం
పెద్దమండ్యం : మండలంలోని కలిచెర్ల సహకార బ్యాంకు మాజీ చైర్మన్ కడప సుధాహరరెడ్డి ఆ బ్యాంకుకు తన భూరి విరాళాన్ని ప్రకటించారు. కలిచెర్ల సహకార బ్యాంకు ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం సంఘం సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుధాహరరెడ్డి మాట్లాడుతూ కలిచెర్లలో సహకార బ్యాంకు ఏర్పాటైనప్పటి నుంచి తన కుటుంబం బ్యాంకు అభివృద్ధి కోసం కృషి చేసినట్లు తెలిపారు. ఛైర్మన్‌గా సుధీర్ఘ కాలం పనిచేసినందుకు తన వంతు విరాళంగా బ్యాంకు అభివృద్ధికి రూ.30 లక్షల నగదు, 12 ఎకరాల భూమిని ప్రకటించారు. రూ.30 లక్షల నగదు ఇప్పటికే డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం సహకార బ్యాంకు పేరిట 12 ఎకరాలు రిజిష్టర్ చేసి ఆ పత్రాలను తహసీల్దారు సయ్యద్ అహ్మద్‌కు అందజేశామన్నారు. సహకార బ్యాంక్ పర్సన్ ఇన్‌చార్జి సి.రఘునాథరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 41 సహకార బ్యాంకులుండగా, కలిచెర్ల బ్యాంకు అభివృద్ధిలో మాజీ ఛైర్మన్ సహకారం మరువలేనిదన్నారు. త్వరలో అపోలో మెడికల్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు అయన తెలిపారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని ఆయన ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమంలో శిద్దవరం విశ్వనాథరెడ్డి, తహసీల్దారు సయ్యద్ అహ్మద్, సర్పంచ్ జింకా విశ్వనాథ్, రైతులు పాల్గొన్నారు.
బ్యాంక్ అభివృద్ధికి రూ.30 లక్షల నగదు
12 ఎకరాల భూమి కేటాయింపు
Comments
Please login to add a commentAdd a comment