రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్లు మృతి
పాఠశాలకు వెళ్లాలనే ఆతృతతో ఇద్దరు మైనర్లు ద్విచక్ర వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. మండలంలోని బోడిగుట్ట, మెరంపల్లెకు చెందిన హర్షవర్ధనాచారి(07). నరేంద్రాచారి(15లు పాఠశాలకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంలో బయలు దేరారు. గుర్రంకొండకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతిచెందారు. ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించిబోయి అవగాహనా రాహిత్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకొన్నారు. కనీసం వారికి వాహనాలిచ్చే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ లేదనే భావన తల్లిదండ్రులకు కలగకపోడవం బాధాకరం. గతంలో గుర్రంకొండ పట్టణంలో పది వరకూ రోడ్డుప్రమాదాలు జరిగి పలువురు ఆస్పత్రుల పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment