ఆడ బిడ్డలు లేనిదే మానవ సృష్టి లేదు
సిద్దవటం : ఆడబిడ్డలు లేనిదే మానవ సృష్టి లేదని.. నేటి ఆడబిడ్డలే రేపటి తల్లులు అని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సమీర్ బాషా తెలిపారు. సిద్ధవటం నలంద పాఠశాలలో శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమీర్ బాషా మాట్లాడుతూ సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలలో అవగాహన పెంచడానికి, బాలల చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఏటా జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నలంద పాఠశాల కరస్పాండెంట్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ బాలికల పట్ల వివక్షత చూపరాదన్నారు. భ్రూణ హత్యల నివారణ, సమాజంలో చైతన్యాన్ని పెంచే చట్టాల అమలుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని తెలిపారు. జేవీవీ మండల అధ్యక్షుడు రామకేశవ మాట్లాడుతూ చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఆమోదిస్తూ తక్షణమే చట్టం చేయాల కోరారు. అనంతరం జాతీయ బాలికల దినోత్సవం కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సమీర్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment