రాయచోటి : రాయచోటిలో 13 ఏళ్ల మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన 50 సంవత్సరాల వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఆర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. రాయచోటి పట్టణం, మాసాపేటలో నివాసం ఉంటున్న శివయ్యకు 13 సంవత్సరాల మానసిక (మూగ) దివ్యాంగురాలైన బాలిక ఉంది. ఈ బాలికపట్ల మాసాపేటకు చెందిన కాయల శంకరయ్య (50) అసభ్యంగా ప్రవర్తించి హింసించినట్లు బాలిక తల్లి శనివారం రాత్రి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శంకరయ్యపై ఫోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
కల్నల్ సీకే నాయుడు క్రికెట్ టోర్నీ ప్రారంభం
కడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని వైఎస్ రాజా రెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో కల్నల్ సీకే నా యుడు అంతర్ రాష్ట్రాల క్రికెట్ టోర్నమెంట్ ప్రా రంభమైంది. ఇందులో భాగంగా శనివారం ఆంధ్ర, పంజాబ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొ లుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా జట్టు 83 ఓవర్ల లో 211 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టు లోని జి.ఎస్.పి. తేజ 157 బంతుల్లో 8 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. ఈయనకు జతగా ఎస్. డి. ఎన్.వి. ప్రసాద్ 27, రేవంత్‌రెడ్డి 23 పరుగులు చే శారు. అలాగే పంజాంబ్ బౌలర్లు క్రిష్ భగత్ 4 వికె ట్లు, ఆర్యమన్ దలీవాల్ 2, అభయ్ చౌదరి 2 వికెట్లు తీశారు. దీంతో తొలిరోజు ఆట ముగిసింది.
రైలు కిందపడి మహిళ ఆత్మహత్య
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని కలమల్ల– ముద్దనూరు రైల్వే స్టేషన్‌ల మధ్యలోని సున్నపురాళ్లపల్లె గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్‌పై అదే గ్రామానికి చెందిన చిన్నిగాళ్ల బుజ్జి (49) రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్నట్లు ఎర్రగుంట్ల రైల్వే ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి శనివారం తెలిపారు. మృతురాలికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో గూడ్సు రైలు కింద పడి ఆత్యహత్య చేసుకుందని తెలిపారు. మృతురాలికి భర్త యేసయ్యతో పాటు ముగ్గురు సంతానం ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు
మానవ హక్కులను తెలుసుకోవాలి
– జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురప్ప
కడప రూరల్ : మానవ హక్కుల రక్షణ చట్టాలను గురిచి తెలుసుకోవాలని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుర్రప్ప తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్‌లో జిల్లా అధ్యక్షుడు సయ్యద్ షాబుద్దీన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశ మందిరంలో శనివారం షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా, నగర కమిటీలను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా సయ్యద్ షాబుద్దీన్ మరియు నగర అధ్యక్షులుగా ప్రసన్న కుమార్‌ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ నజముద్దీన్, రాష్ట్ర అధ్యక్షులు అలీ షేర్ ఎస్‌ఎండీ తాహిర్, జిలాని, బాదుల్లా, బషీర్ బుఖారి తాహిరుల ఖాదిరి, మహిళ అధ్యక్షురాలు ఆస్మా, కిరణ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment