ఈ రాశివారికి కొత్త వ్యక్తులతో పరిచయం, శుభవార్తలు వింటారు..! | Daily Horoscope July 20-07-2024 | Sakshi
Sakshi News home page

Telugu Horoscope: ఈ రాశివారికి కొత్త వ్యక్తులతో పరిచయం, శుభవార్తలు వింటారు..!

Published Sat, Jul 20 2024 7:03 AM | Last Updated on Sat, Jul 20 2024 8:35 AM

Daily Horoscope July 20-07-2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు  ఆషాఢ మాసం, తిథి: శు.చతుర్దశి సా.5.20 వరకు,తదుపరి పౌర్ణమి, నక్షత్రం: పూర్వాషాఢ రా.2.25 వరకు,తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.12.04 నుండి 1.40 వరకు,దుర్ముహూర్తం: ఉ.5.37నుండి 7.21 వరకు,అమృతఘడియలు: రా.9.37 నుండి 11.12 వరకు. 

మేషం: దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్య సూచనలు. పనులు మందకొడిగా సాగుతాయి. నిర్ణయాలలో కొన్ని మార్పులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. ముఖ్యమైన పనులు కొన్ని నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.

మిథునం: కుటుంబంలో సందడిగా ఉంటుంది. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధన,వస్తులాభాలు. దైవదర్శనాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కాస్త ఊరట లభిస్తుంది.

కర్కాటకం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. అవార్డులు దక్కుతాయి.

సింహం: ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో కొన్ని చిక్కులు.  ఉద్యోగాలలో మరింత పనిభారం. ఆరోగ్యభంగం.

కన్య: కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొనవచ్చు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. వ్యవహారాలలో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

వృశ్చికం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొంత ఒత్తిడులు. ఆరోగ్యభంగం. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

ధనుస్సు: చిన్ననాటి మిత్రులతో చర్చలు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత. విందువినోదాలు.

మకరం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు.

కుంభం: ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొంతమేర వసూలవుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement