శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.ఏకాదశి ప.3.10 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఆశ్లేçష ఉ.7.03 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: రా.8.21 నుండి 10.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.03 వరకు, తదుపరి రా.10.33 నుండి 11.23 వరకు, అమృతఘడియలు: లేవు.
సూర్యోదయం : 5.55
సూర్యాస్తమయం : 5.40
రాహుకాలం : ప.3.00
నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం: కొత్త రుణాలు చేస్తారు. సోదరులు, మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. వ్యవహారాలలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.
వృషభం: నూతన ఉద్యోగయోగం. పనులు చకచకా సాగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విందువినోదాలు.
మిథునం: మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. ఆస్తి విషయంలో చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
కర్కాటకం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి.దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. .
సింహం: వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.
తుల: ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి ఉంటుంది.
వృశ్చికం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
మకరం: ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. సోదరులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కుంభం: పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. దైవచింతన. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.
మీనం: ఆర్థిక విషయాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. రుణఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు సంభవం.
Comments
Please login to add a commentAdd a comment