మంత్రికి అవోపా సన్మానం
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ను ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) ఆధ్వర్యంలో గురువారం రాత్రి అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, క్రేన్ గ్రూప్ అధినేత జీవీఎస్ కాంతారావు, అవోపా రాష్ట్ర అధ్యక్షుడు తటవర్తి రాంబాబు, ప్రతినిధులు కేవీ బ్రహ్మం, రాచపూడి సుబ్బారావు, మద్దు రామకృష్ణయ్య, కొత్తమాసు ఏకానంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment