రైల్వేగేటును ఢీకొట్టిన కారు
చీరాల రూరల్: రైల్వేగేటు మూసి ఉండగా ఓ కారు వేగంగా గేటులో నుంచి దూసుకుపోయి నిలిచిపోయింది. ఈ ఘటన గురువారం రాత్రి చీరాలలోని కారంచేడు రైల్వేగేటు సెంటర్లో చోటుచేసుకుంది. ఆర్పీఎఫ్ సీఐ చంద్రశేఖర్ వివరాల మేరకు.. దేవరంపాడుకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి తన కారును వేగంగా నడిపి మూసి ఉన్న గేటును ఢీకొట్టినట్లు చెప్పారు. ఆ సమయంలో పట్టాలపై ఓ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణించిందని, కారు పట్టాలపైకి చేరినట్లయితే పెనుప్రమాదం జరిగేదని సీఐ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment