అమరావతి: నెమలికల్లు గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వంగా నవీన్‌రెడ్డి(24) గురువారం హైదరాబాద్‌లో తాను పనిచేస్తున్న కార్యాలయ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. నెమలికల్లు గ్రామానికి చెందిన వంగా శ్రీనివాసరెడ్డి, ప్రమీల దంపతులు తమకున్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ తమ ఇద్దరి కుమారులను చదివించారు. పెదవాడైన నవీన్‌రెడ్డికి ఇటీవల ఇంజనీరింగ్ పూర్తిచేసుకుని హైదరాబాద్‌లోని సాప్టవేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. గురువారం తాను పనిచేస్తున్న ఆఫీసు భవనం పై నుంచి దూకి అత్మహత్య చేసుకున్నాడు. చేతికందివచ్చిన కొడుకు ఇలా బలవన్మరణానికి పాల్పడడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి రెండో కుమారుడు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రికి నవీన్‌రెడ్డి మృతదేహాం స్వగ్రామమైన నెమలికల్లు చేరుకుంది.
వంగానవీన్‌రెడ్డి (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment