టీడీపీ పెద్దల కుట్ర మేరకే నాపై కేసు
నరసరావుపేట: తెలుగుదేశం పార్టీ పెద్దల కుట్ర, ఆ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఆదేశాల మేరకే తనపై అక్రమ కేసు పెట్టారని, దీనికి భయపడేది లేదని, చట్టపరంగా పోరాడతామని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గురువారం గుంటూరు రోడ్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాక్ష్యాలు లేకుండా అవాస్తవ ఆరోపణలతో ఒక మతి స్థిమితంలేని బ్లాక్‌మెయిలర్ చేస్తున్న ఆరోపణల మేరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన తనపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అక్రమ కేసు బనాయించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఫిర్యాది, పమిడిపాడు గ్రామానికి చెందిన చెందిన కొల్లా సాంబశివరావు ఎవరో తనకు తెలియదని, అతని ముఖం కూడా ఇప్పటివరకు చూడలేదని స్పష్టం చేశారు. అతను ఎవరా అని ఆరా తీస్తే , గుంటూరుకు చెందిన కామరాజు అనిల్‌కుమార్ వద్ద 6.10 ఎకరాల భూమి కొనేందుకు సాంబశివరావు అడ్వాన్స్ చెల్లించి 2021 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయాడని, కొందరు రాజకీయనాయకులను పట్టుకొని అప్పుడు ఉన్న డీఎస్పీ వద్ద పంచాయితీ చేసుకున్నాడని తెలిసిందని పేర్కొన్నారు. ఆ భూమి రిజిస్ట్రేషన్ సమయంలో సాంబశివరావు వద్ద డబ్బులు లేకపోతే నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన రవికిషోర్‌రెడ్డి ఆ డబ్బు ఇచ్చి తన బంధువైన తాటిపర్తి కోటిరెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడని, అప్పుడే అనిల్‌కుమార్‌కు, తనకు ఎలాంటి వివాదాలూ లేవని సాంబశివరావు ఒప్పందపత్రం రాసిచ్చాడని వివరించారు. ఇప్పు డు ఆ భూమిపై ఎలాంటి హక్కు లేని సాంబశివరావు బ్లాక్‌మెయిల్ చేస్తూ తనపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బిహార్ నుంచి తుపాకీ తెప్పించి తమను కాల్చేస్తానని సాంబశివరావు బెదిరిస్తున్నాడని, చూస్తుంటే అతనికి మతిస్థిమితం లేనట్టు ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండా, ఏం జరిగిందో తెలుసుకోకకుండా కేసు పెట్టడం సరికాదని గోపిరెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ పెద్దల ఒత్తిడి మేరకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారన్న సాకుతో పోలీసు ఉన్నతాధికారులపైనా అక్రమ కేసులు పెడుతున్న పరిస్థితి గతంలో ఎన్న డూ చూడలేదని గోపిరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.
ఎటువంటి సాక్ష్యాలు లేకుండా కేసు
నమోదు చేయటం దుర్మార్గం
ఫిర్యాదిదారుడు మతిస్థిమితం
లేని ఒక బ్లాక్ మెయిలర్
బిహార్ నుంచి తుపాకీ తెచ్చి
కాల్చేస్తానని ఫిర్యాది అంటున్నాడు
విలేకరుల సమావేశంలో మాజీ
ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment