బాపట్ల టౌన్: బాపట్లలో ఈనెల 26న శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీపీఐ నాయకుడు జె.బి.శ్రీధర్ తెలిపారు. శృంగారపురంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శ్రీధర్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, కార్మిక, కర్షకులకు అండగా అనేక పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ సీపీఐ అన్నారు. దేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి ఎంతోమంది కమ్యూనిస్టు నాయకులు జైలుకెళ్లి జైలు జీవితం గడిపారని తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు అధికారం అనుభవిస్తున్న పార్టీలు మత విద్వేషాలను రెచ్చగొడుతూ, మతాల మధ్య చిచ్చుల పెడుతోందని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రధాన మోడీ వెనకేసుకోస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మీద పార్లమెంట్ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి అమిత్ షాకి గుర్తులేదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment