సంక్షేమం నుంచి సంక్షోభం వైపు..
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఐదేళ్ల వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పార్టీలు, కులాలు, మతాలకతీతంగా సంక్షేమ పథకాలను అందుకొని పేద, మధ్యతరగతి ప్రజలు సుఖసంతోషాలతో గడపగా ఆరు నెలల చంద్రబాబు సంక్షోభపాలన ప్రజలను కష్టాల్లోకి నెట్టి కొత్త ఏడాది పండుగ సంబరాలకు దూరం చేసింది. జగన్ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రతినెలా ఏదో ఒక పథకం ద్వారా నిధులు సమకూరగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క పథకం ద్వారా కూడా ప్రజలకు ఆర్థికంగా చేయూత లభించే అవకాశం లేకుండా పోయింది. గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారు. అన్నదాత సుఖీభవలేదు, తల్లికి వందనం లేదు. 59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 అసలే ఇవ్వలేదు. ఇంటికి మూడు సిలెండర్లలో కోత పెట్టి ఒకటే ఇచ్చారు. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధర ఇచ్చి కొనే పరిస్థితిలేదు. నిరుద్యోగ భృతిలేదు. సూపర్‌సిక్స్ పేరుతో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదు. మరోవైపు ప్రకటనలు తప్ప అభివృద్ధి కార్యక్రమాల ఊసేలేదు. సంక్షేమ పాలన గాడితప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా చేయూత లేక ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. తద్వారా చిరువ్యాపారులు మొదలు అన్ని రకాల వ్యాపారాలు దివాళా తీశాయి. ప్రజలు కూటమి పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొత్త ఏడాది సంబరాలు వెలవెలబోతున్నాయి.
● అన్నదాతా దుఃఖీభవ
ఎన్నికల సమయంలో రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు పెట్టుబడి సాయమందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కారు. జిల్లాలో 1,92,039 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.385 కోట్లు ఇవ్వాల్సి వుండగా పైసా ఇవ్వలేదు. తేమశాతంతోపాటు పలు ఆంక్షలతో పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. మిల్లర్లతో కుమ్మకై ్క మొక్కుబడిగా కూడా ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంతో బయట మార్కెట్ వ్యాపారులు బస్తా రూ.1300 నుంచి రూ.1350కి మించి ధాన్యం కొనడంలేదు.
● తల్లికి వంచనం
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అమ్మ ఒడి పథకాన్ని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో అమలు చేస్తామని ప్రచారం చేశారు. జిల్లాలో 1,16,019 మంది తల్లులు ఉండగా కూటమి ప్రభుత్వం చెప్పినట్లు ఇంట్లో కనీసం ఇద్దరికి ఇచ్చినా రూ.350 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికి పైసా ఇవ్వలేదు.
● మహిళలకు రూ.1500 ఎగనామం
18 నుంచి 59 సంవత్సరాల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. జిల్లాలో 6,61,841 మంది మహిళలు ఉండగా నెలకు రూ.99.27 కోట్లు ఇవ్వాల్సి వుంది. ఇప్పటివరకూ దాని ఊసేలేదు.
● కొందరికే సిలెండర్
ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు సిలెండర్లు ఇస్తామని చెప్పి కొంతమందికి మాత్రమే ఒక్క సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఒక్కో కుటుంబానికి మూడు సిలెండర్ల చొప్పున రూ.2700 జమ చేయాల్సివుంది. జిల్లాలో 4,60,830 కుటుంబాలకుగాను రూ.124.42 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం పైసా ఇవ్వలేదు.
● రోడ్డెక్కని ఉచిత బస్సు
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని కూటమి నేతలు ఓట్లేయించుకున్నారు. జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేస్తే ప్రతిరోజూ 90 వేల మంది మహిళలు ప్రయాణించనున్నారు. వీరందరూ ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అందరికీ అన్నీ..
వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో జిల్లాలో సంక్షేమం ప్రతి ఇంటి తలుపు తట్టింది. ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ క్యాలెండర్ ఏర్పాటుచేసి మరీ ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేశారు. ఆర్థిక కష్టాలకు దూరంగా ప్రజలు సంతోషంగా జీవనం సాగించారు.
1,16,019 మంది అమ్మ ఒడి లబ్ధిదారులకు రూ.489 కోట్లు చెల్లించారు.
జగనన్న వసతి లబ్ధిదారులు 30,611 మందికి రూ. 29.16 కోట్లు లబ్ధి చేకూర్చారు.
విద్యా దీవెన లబ్ధిదారులు 31,046 మందికి రూ.92.28 కోట్లు ఇచ్చారు.
వైఎస్సార్ రైతు భరోసా ద్వారా 1,92,037 మందికి రూ.1181 కోట్లు లబ్ధి చేకూర్చారు.
మనబడి నాడు–నేడు ద్వారా రూ. 304.12 కోట్లు ఖర్చుచేసి 1433 పాఠశాలలు ఆధునికీకరించారు.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 1,37,421 మందికి రూ.331.82 కోట్లు ఖర్చుచేశారు.
వైఎస్సార్ చేయూత ద్వారా 85,846 మందికి రూ.439.13 కోట్లు నగదు లబ్ధి చేకూర్చారు.
ఇవేకాకుండా హామీ ఇచ్చిన అన్ని పథకాలను దాదాపు అమలు చేశారు. మ్యానిఫెస్టోలో చెిప్పని అనేక హామీలనూ అమలుపరిచారు. నెలనెల లక్షలాది మందికి పింఛన్లు మొదలు అన్ని పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూర్చారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు వైఎస్.జగన్ పాలనలో సంతోషంగా బతికారు.
గత పాలనలో అర్హులందరికీ సంక్షేమం
దానికి దీటుగా అభివృద్ధి పథకాలు
రైతులతోపాటు అన్నివర్గాల
ప్రజలకు అండగా ప్రభుత్వం
సుఖసంతోషాలతో ఉన్న ప్రజలు
ఆరునెలల కూటమి పాలనలో
సంక్షేమానికి పాతర
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్
హామీలకు మంగళం
అన్నదాత సుఖీభవలేదు–
విద్యాదీవెన ఎగవేత
ప్రకటనలకే పరిమితమైన
అభివృద్ధి కార్యక్రమాలు
వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనను
గుర్తుచేసుకుంటున్న జనం
Comments
Please login to add a commentAdd a comment