ఫోర్జరీ కేసు
రెవెన్యూ అధికారులపై
మేదరమెట్ల: కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన రెవెన్యూ అధికారులపై ఫోర్జరీ కేసు నమోదైంది. కొరిశపాడు మండలం మేదరమెట్ల పోలీసు స్టేషన్‌లో గత నెల 30న తహసీల్దార్, సబ్ రిజి స్ట్రార్, వీఆర్వో సహా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మహ్మద్ రఫీ వివరాల మేరకు.. మేదరమెట్ల గ్రామానికి చెందిన మార్పూడి వెంకటేశ్వర్లుకు ఆదే గ్రామానికి చెందిన నెక్కంటి సుబ్బారావు నగదు ఇవ్వాలి. పాత బకాయిల విషయంపై 2023 మార్చి 23న ఒంగోలు కోర్టులో వెంకటేశ్వర్లు దావా వేశాడు. దీంతో కోర్టు సుబ్బారావుకు చెందిన 575/33సీ–1 సర్వేలో ఉన్న 44 సెంట్ల భూమిని అటాచ్ చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ విషయాన్ని బాధితుని తరఫు న్యాయవాది అద్దంకి సబ్ రిజిస్ట్రార్, కొరిశపాడు తహసీల్దార్‌కు తెలిపారు. కోర్టు అటాచ్ చేసిన అంశాలకు సంబంధించి మార్పులు చేయకూడదనే నిబంధన ఉన్నా రెవెన్యూ అధికారులు ఆదేశాలను ధిక్కరించి 2023 జూన్ 28న సుబ్బారావుకు 85 సెంట్ల భూమి ఉన్నట్లు ఆన్‌లైన్‌లో ఎక్కించారు. దీనిపై బాధితుడి తరఫు న్యాయవాది అద్దంకి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆదేశానుసారం అప్పటి సబ్‌రిజి స్ట్రార్, తహసీల్దార్, వీఆర్వోతో పాటు మరో ఆరుగురిపై ఫోర్జరీ కేసు నమోదు చేసి నోటీసులు అందజేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్(దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శుక్రవారం 1716 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యాంక్ కెనాల్‌కు 140, తూర్పు కెనాల్‌కు 174, నిజాంపట్నం కాలువకు 34, కొమ్మమూరు కాలువకు 975 క్యూసెక్కులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment