తీరంలో ఘోరం
●
చీరాల టౌన్: సముద్రాన్ని చూస్తే ఎంతటి వారికై నా ఆహ్లాదం, ఆనందం, ప్రశాంతత లభిస్తాయి. అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అయితే, నియోజకవర్గంలోని సముద్ర తీరం దీనికి భిన్నంగా ఉంది. కుళ్లిన వ్యర్థాలు, రొయ్యల ఫ్యాక్టరీలు, హేచరీల నుంచి వచ్చే రసాయనాలతో కలుషితం అవుతోంది. ట్యాంకర్లతో రోజుకు వందలాది లీటర్ల వ్యర్థాల నీటిని యథేచ్ఛగా సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో సముద్ర తీర ప్రాంతం అంతా దుర్గంధం వ్యాపిస్తోంది. కళ్లెదుటే వ్యర్థాల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నా పంచాయతీరాజ్, మత్స్యశాఖ, పొల్యూషన్ కంట్రోల్ సిబ్బంది, అధికారులు కళ్లు మూసుకుని విధులు నిర్వహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల వల్లే చేటు
జిల్లాలో చీరాల, వేటపాలెం, బాపట్ల, నిజాంప ట్నం, చినంగంజాం తీరప్రాంత మండలాలున్నాయి. 76 కిలో మీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఈ తీరం ఒడ్డునే మత్స్య సంపదను ఎగుమతికి చేసేందుకు పలు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా రొయ్యలు, చేపలు ప్రాసెసింగ్ కంపెనీలతో పాటుగా హేచరీలు కూడా ఉన్నాయి. బాపట్ల పాండురంగాపురంలో ఎనిమిది, వాడరేవు రామాపురం తీరప్రాంత గ్రామాల్లో ఎనిమిది ప్రాసెసింగ్ హేచరీలు, యూనిట్లు ఉన్నాయి. వాడరేవులో రొయ్యలు, చేపలు ప్రాసెసింగ్ చేసి లక్షల్లో సంపాదించే బడా వ్యాపారస్తులు రోజుకు 1.5 లక్షల నీటిని వినియోగిస్తుంటారు. ప్రాసెసింగ్‌లో వచ్చిన 50 వేల లీటర్ల వ్యర్థాల నీటిని మాత్రం యథేచ్ఛగా ట్యాంకర్ల ద్వారా వాడరేవు–రామాపురం మధ్య సముద్రంలోకి వదులుతున్నారు. ప్రతీ రోజు తెల్లవారుజామున, రాత్రి ఎనిమిది గంటల నుంచి ఈ తంతు నడుపుతున్నారు. ఒక్కో ప్లాంట్ రోజుకు రెండు విడతలుగా 10 ట్యాంకర్లు ద్వారా కుళ్లిన చేపల వ్యర్థాలు, రసాయనాల నీటిని సముద్రంలో వదులుతున్నారు. కలుషిత, మురుగునీటిని సముద్రంలో కలపడం వల్ల మత్స్య ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్యాంకర్లు ద్వారా వ్యర్థాల నీటిని సముద్రంలో వదులుతున్నప్పటికీ గ్రామంలోనే ఉండే మత్స్యశాఖ ఉద్యోగులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఉద్యోగులు కళ్లు మూసుకుని విధులు నిర్వహిస్తున్నారా ? అని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రజల ప్రాణాలకే ముప్పు
చర్యలు తీసుకుంటాం
సముద్ర తీర గ్రామాల్లో ఉన్న హేచరీలు, రొయ్యలు, చేపల ప్రాసెసింగ్ యూనిట్లు మురుగు నీటిని, వ్యర్థాలను సముద్రంలోకి వదులుతున్నారని నాకు తెలియదు. ఇది మంచిది కాదు. వ్యాపారులు విధిగా ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాల్సిందే. సముద్రంలోకి వ్యర్థాలు, నీటిని వదిలే వాటిపై చర్యలు తీసుకుంటాం.
– కృష్ణ కిశోర్, మత్స్యశాఖ ఏడీ
వ్యాపారులకు కాసులు
పర్యాటకులకు రోగాలు
రోజూ వేల లీటర్ల వ్యర్థ, కలుషిత
జలాలను సముద్రంలోకి వదులుతున్న
ప్రాసెసింగ్ యూనిట్లు, హేచరీలు
కన్నెత్తి చూడని అధికారులు
ఏడాదికి ఒక్కో ప్లాంట్ నుంచి సగటున రూ.10 కోట్ల నుంచి 20 కోట్లు వరకు వ్యాపారాలు చేసే యజమానులు కనీసం ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవడం లేదు. కనీసం కార్మికశాఖ నుంచి అనుమతులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు కూడా కనిపించవు. కోట్లలో వ్యాపారం చేసుకునే బడా బాబులు యథేచ్ఛగా ప్రకృతి ప్రసాదించిన కడలిని కలుషితం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వ్యర్థాలు, కెమికల్, మురుగునీరు కలసిన నీటిలో స్నానాలు చేస్తే చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు ఉత్పన్న అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment